రెడ్డిలు, రావులు అందరూ మా దగ్గరకు రావాల్సిందే: అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-09 13:57:22  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రెడ్డిలు, రావులు అందరూ మా దగ్గరకు రావాల్సిందే: అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రెడ్డిలు, రావులు మా దగ్గరకు రావాల్సిందే. ముఖ్యమంత్రుల వద్దకు మేము వెళ్లం.. వాళ్లే మా దగ్గరకు వస్తారని హాట్ కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎంఐఎం మద్దతు లేకుండానే కాంగ్రెస్ గెలిచిందా? అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం బ్రదర్స్ సత్తా చూపిస్తాం అని కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు అసోం సీఎం హిమంత బిశ్వపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్లింలను కాల్చుతున్నట్లుగా ఉన్న హింసాత్మక వీడియో నేపథ్యంలో హిమంతపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. ముస్లింలను రెచ్చగొట్టేలా దురుద్దేశపూర్వకంగా ఈ వీడియోను పోస్టు చేసినందుకు చర్యలు తీసుకోవాలని, అసోం ముఖ్యమంత్రి రెండు మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఒవైసీ విమర్శించారు. ఆయన తీరు జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించేలా ఉందని మండిపడ్డారు.

Next Story