HYD: మియాపూర్‌లో ఘోరంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ.. ఊపిరి తీసుకోవడం కష్టమే..

by Bhoopathi Nagaiah |

హైదరాబాద్‌లోని మియాపూర్‌(Miyapur)లో ఎయిర్ క్వాలిటీ(Air quality) 342 గా నమోదైంది.

HYD: మియాపూర్‌లో ఘోరంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ.. ఊపిరి తీసుకోవడం కష్టమే..
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని మియాపూర్‌(Miyapur)లో ఎయిర్ క్వాలిటీ(Air quality) 342 గా నమోదైంది. మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్(Naren Gardens) వీధిలో ఇద్దరు బిల్డర్లు (Builders)చేస్తున్న విధ్వంసమే ఇందుకు ప్రధాన కార‌ణం. అందులో ఒకటి సియా బిల్డర్స్(Sia Builders) మరొక సంస్థ ప్రైమార్క్ బిల్డర్స్(Primark Builders). ఈ రెండు నిర్మాణ‌ సంస్థల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడి చుట్టు ప‌క్కల ప్రజ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అటు పీసీబీ(PCB) అధికారులు, ఇటు జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు స‌మ‌స్యను పెద్దగా ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. మియాపూర్‌లోని న‌రేన్ గార్డెన్స్ రోడ్డులో సియా బిల్డర్స్, ప్రైమార్క్ క‌న్‌స్ట్రక్షన్స్ లు గ‌త కొంత‌ కాలం నుంచి అపార్టుమెంట్లను నిర్మిస్తున్నారు. ఆరంభం నుంచీ ఈ రెండు సంస్థలు క‌నీస ప్రమాణాల్ని పాటించ‌డం లేదు. ఎలాంటి ముంద‌స్తు జాగ్రత్తల్ని తీసుకోకుండా ఈ చుట్టు ప‌క్కల ప్రాంతాల్లో బాంబుల మోత మోగించారు. స్థానికుల నుంచి తీవ్ర అభ్యంత‌రాలు వ‌చ్చినా.. రాత్రింబ‌వ‌ళ్లు ప‌నుల్ని కొనసాగిస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడేమో నిర్మాణ సమయంలో కనీస ప్రమాణాల్ని పాటించ‌డం లేదు. అపార్ట్మెంట్ కట్టేటప్పుడు పక్క అపార్టుమెంట్ల మీద దుమ్మూ, ధూళి పడకుండా చర్యల్ని తీసుకోవ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. దీంతో పెద్దలు, చిన్నారులు, మ‌హిళ‌ల‌కు శ్వాస‌కోస (Breathing problems)సంబంధిత స‌మ‌స్యలు ఏర్పడుతున్నాయి. ఈ రెండు సంస్థలు వెద‌జ‌ల్లే కాలుష్య (Pollution)తీవ్రతను చూస్తే ఎవ‌రైనా ఆశ్చర్యపోవాల్సిందే. గాలి ప్రమాణాలు(Air standards) ఇక్కడ 342గా న‌మోదైంది.

ఎందుకు ఉదాసీనత?

అధికారులు అధికారులను ఎలా మెప్పిస్తున్నారో అర్ధం కావడం లేదంటున్నారు. జీహెచ్ఎంసీ, పీసీబీ అధికారులెవరూ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా లేరు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఏనాడూ ఈ డెవలపర్స్ ని పిలిచి మాట్లాడిన దాఖలాలు లేవని, కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదంటున్నారు. ప్రభుత్వ సిబ్బంది చూసీ చూడనట్లు వదిలేయడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయ‌ని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇదే కొన‌సాగితే మియాపూర్ ప్రాంత‌మంతా ఇదే దుస్థితి త‌లెత్తే ప్రమాద‌ముంది. ఇప్పటికే ట్రాఫిక్ జామ్‌ల‌తో నిత్యం న‌ర‌కం అనుభ‌విస్తున్న జనం.. ఇక్కడి గాలి కాలుష్యం కార‌ణంగా హ‌డ‌లెత్తిపోతున్నారు. పీసీబీ అధికారులు, చందానగర్ మునిసిపల్ అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర నుంచి లేచి తమ స‌మ‌స్యల నుంచి కాపాడాల‌ని కోరుతున్నారు.

డస్ట్ ప్రూఫ్ షీట్స్ పెట్టండి

మేం ఇండ్లల్లో ఉండలేకపోతున్నాం. భయంకరమైన దుమ్మ ధూళి ఇండ్లల్లోకి వస్తుంది. ప్రాజెక్టు చేపట్టిన ప్రాంతం నుంచి నిరంతరం పనులు చేస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికే చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యారు. పొరుగున ఉన్న తమతో మంచి రిలేషన్ ఉంచుకోవాలని, ఇక్కడ నివాసం ఉంటున్న వారికి సేఫ్ లైవ్ లీ హుడ్(Safe Live Lee Hood) ఉండేటట్లుగా చర్యలు తీసుకోండి. ఇలాగే దుమ్ముతో ఉంటే తామంతా అనారోగ్యానికి గురవుతామంటూ గత డిసెంబరు 10న ఎస్ఐఏ కన్ స్ట్రక్షన్ కంపెనీ (SIA Construction Company)సైట్ మేనేజర్ కి లిఖితపూర్వకంగా పక్కనే ఉన్న అపార్టుమెంటువాసులు ఇచ్చారు. వెంటనే డస్ట్ ప్రూఫ్ షీట్స్(Dust proof sheets) పెట్టాలని కోరారు. కానీ నేటికీ ఏర్పాటు చేయలేకోపోవడం వల్ల గాలి కాలుష్యం పెరిగి ఎంతో మంది అనారోగ్యానికి గురయినట్లు అపార్టుమెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నార్నే ఆర్చ్(Narne Arch) నుంచి ప్రాజెక్టు వరకు రోడ్లు ధ్వంసం చేశారు. నిర్మాణ ప్రాంతానికి భారీ వాహనాలు రోజూ అత్యధికంగా రావడం వల్ల చెడిపోయాయి. వెంటనే మరమ్మతు చేయించాలంటూ ఎస్ఐఏ సైట్ మేనేజర్ కి జనవరి 23న కూడా లిఖితపూర్వకంగా రిక్వెస్ట్ చేశారు. అయినా పట్టించుకోవడం లేదని వాపోయారు.

పోలీసులకు మొర

మియాపూర్ నార్నె ఆర్చ్ దగ్గరలో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణానికి ఇష్టారీతన బాంబు బ్లాస్టింగ్(Bomb blasting) చేపడుతున్నారని, సెల్లార్ల తవ్వకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని 2022 జూన్ 28న మియాపూర్ పోలీస్ ఇన్‌ స్పెక్టర్(Miyapur Police Inspector) కి పక్కనే ఉన్న అపార్టుమెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. సదరు కాంట్రాక్టర్ తో తాము పలుసార్లు రిక్వెస్ట్ చేసినా పట్టించుకోవడం లేదని, కనీసం రాత్రి 10 తర్వాతైనా పనులు నిలిపివేయాలని కోరినా వినిపించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రై మార్క్, ఇతర నిర్మాణ సంస్థలు రాత్రింబవళ్లు తేడా లేకుండా పనులు చేపట్టడం వల్ల తాము ధ్వని(Noise pollution), గాలి కాలుష్యం(Air pollution)తో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నామంటూ పోలీసులకు మొర పెట్టుకున్నారు. సెల్లార్ల తవ్వకాల్లోనూ పెద్ద పెద్ద బాంబ్ బ్లాస్టింగ్స్ చేపట్టడం వల్ల తమ అపార్టుమెంట్లకు నష్టం వాటిల్లుతుందని, కాలుష్యంతో బతకలేకపోతున్నామన్నారు. అపార్టుమెంట్లల్లో యూకే, యూఎస్ఏ, యూరోప్ టైమింగ్స్ ప్రకారం వర్క్ ఫ్రం హోం పని చేస్తున్న వారు చాలా మంది ఉన్నారని, వారందరికీ తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. కనీసం రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు పొల్యూషన్ అండ్ రెగ్యులేషన్ రూల్స్(Pollution and Regulation Rules-2000), 2000 ప్రకారం 55 డెసిబుల్స్(decibels) దాటకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ అమలు చేయకపోవడం వల్ల తామెంతో మానసిక, శారీరక వేదనను అనుభవిస్తున్నట్లు ఈ ప్రాజెక్టుల చుట్టూ ఉండే అపార్టుమెంట్ వాసులు మండిపడుతున్నారు.

Next Story