- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AIMIM: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నిక.. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్
హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఇవాళ్టితో నామినేషన్లకు గడువు ముగియనుంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఇవాళ్టితో నామినేషన్లకు గడువు ముగియనుంది. దీంతో ఆయా పార్టీలో తమ అభ్యర్థును ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏఐఎంఐఎం (AIMIM) పార్టీ తమ అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ (Mirza Riyaz Ul Hassan Effendi)ని ఖరారు చేసింది. దీంతో ఆయన మరికొద్దిసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే, ఆయన నూర్‌ఖాన్ బజార్ (Nurkhan Bazaar), డబీర్‌పురా (Dabirpura) కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఇక 2019లో మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు.
2023లో ఎమ్మెల్సీగా పదవీ కాలం పూర్తి అవ్వడంతో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ (MIM chief Asaduddin) ఓవైసీ మరోసారి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీకీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పించారు. అయితే, హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ (BJP) తమ అభ్యర్థిగా గౌతమ్ రావు (Gautham Rao)ను ప్రకటించింది. ఈ మేరకు ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక అధికార పార్టీకి తాము పోటీకి దూరం అంటూ ప్రకటిస్తూనే.. తాము ఏఐఎంఐఎంకు మద్దుతు ఇస్తామని సూత్రప్రాయంగా తెలిపినట్లుగా సమాచారం. పోటీలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉండటంతో బీజేపీ, ఎంఐఎం మధ్య టఫ్ ఫైట్ తప్పదనే టాక్ వినిపిస్తుంది.






