జీఎస్టీ తగ్గింపుపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి

by Malleboina Mahesh |

ఢిల్లీ వేదికగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్(GST Council) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

జీఎస్టీ తగ్గింపుపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ జీఎస్టీ తగ్గింపు (GST reduction) నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీ వేదికగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్(GST Council) సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 22 నుంచి 5, 18 శాతం స్లాబ్‌లు మాత్రమే కొనసాగించాలని, 12, 28 శాతం స్లాబ్‌లు తొలగించాలని జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు నిర్ణయించారు. అలాగే లగ్జరీ వస్తువులపై 40 శాతం పన్ను విధించనున్నారు. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీని పూర్తిగా రద్దుచేశారు. సమావేశం అనంతరం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) కౌన్సిల్ నిర్ణయాలను మీడియాకు తెలిపారు. అయితే జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయాలపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన గురువారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ.. "ఈ నిర్ణయాన్ని తాము స్వాగతించలేమని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయం రాష్ట్రాల ఆదాయాలు, ఆర్థిక పరిస్థితులపై భారీ ప్రభావాన్ని చూపుతాయని, ప్రతి రాష్ట్రం రూ. 8-10 కోట్ల ఆదాయ నష్టాన్ని ఎదుర్కోబోతోందని ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

Next Story