‘తగ్గేదేలే’ అంటున్న జీవన్‌రెడ్డి: ఇంటికి క్యూ కట్టిన ఏఐసీసీ దూతలు.. గంటల తరబడి బుజ్జగింపులు!

by Gantepaka Srikanth |

ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి రాజీనామా ఉదంతం కాంగ్రెస్ పార్టీలో పెను తుఫాను రేపుతోంది.

‘తగ్గేదేలే’ అంటున్న జీవన్‌రెడ్డి: ఇంటికి క్యూ కట్టిన ఏఐసీసీ దూతలు.. గంటల తరబడి బుజ్జగింపులు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి రాజీనామా ఉదంతం కాంగ్రెస్ పార్టీలో పెను తుఫాను రేపుతోంది. పార్టీ మారాలని నిర్ణయించుకున్న జీవన్‌రెడ్డిని శాంతింపజేసేందుకు అధిష్టానం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మంగళవారం జగిత్యాలలోని ఆయన నివాసం రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారింది. ఆయన్ను బుజ్జగించేందుకు అధిష్టానం ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్‌రెడ్డిని రంగంలోకి దించింది. జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకున్న వంశీచంద్‌రెడ్డి, సుమారు 20 నిమిషాల పాటు ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీలో జీవన్‌రెడ్డి సేవలు ఎంతో అవసరమని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అధిష్టానం తరపున ఆయన కోరినట్లు సమాచారం.

మహేష్‌గౌడ్ భేటీతో మొదలైన కసరత్తు..

వంశీచంద్‌రెడ్డి కంటే ముందే పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ ఉదయాన్నే జీవన్‌రెడ్డిని కలిసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. పార్టీ ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయినప్పటికీ, జీవన్‌రెడ్డి తన ఆవేదనను వారి ముందు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. అధిష్టానం దూతలు ఎంతగా బుజ్జగించినప్పటికీ, జీవన్‌రెడ్డి మాత్రం తన రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని ఖరాఖండిగా చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న తమ లాంటి సీనియర్ల ఆత్మగౌరవానికి భంగం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. "చర్చలు జరిగాయి కానీ, రాజీనామా విషయంలో నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు" అని జీవన్‌రెడ్డి సన్నిహితులతో అన్నట్లు సమాచారం.

Next Story