కాంగ్రెస్‌లో కలుపుమొక్కల్ని తీసేయాలి.. అప్పుడే వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం: ఏఐసీసీ కార్యదర్శి సంపత్

by Naga Rani Yarlagadda |

కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడా కలుపుమొక్కలు ఉన్నాయని, వాటిని తీసివేస్తే పార్టీ ప్రక్షాళన జరుగుతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ అన్నారు.

కాంగ్రెస్‌లో కలుపుమొక్కల్ని తీసేయాలి.. అప్పుడే వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం: ఏఐసీసీ కార్యదర్శి సంపత్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడా కలుపుమొక్కలు ఉన్నాయని, వాటిని తీసివేస్తే పార్టీ ప్రక్షాళన జరుగుతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే అన్ని క్యాడర్స్ లోనూ ప్రక్షాళన జరగాలన్నారు. రెండేళ్ల క్రితం పార్టీలోకి వచ్చినవారు.. రెండేళ్ల తర్వాత ఎక్కడ ఎలా ఉంటారో తెలియదని కీలక వ్యాఖ్యలు చేశారు. తమలాంటి వారు చనిపోయేంతవరకూ పార్టీలోనే ఉంటారన్న సంపత్.. మళ్లీ ఎన్నికల్లో గెలవాలంటే పార్టీకి పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అవసరమని జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ తనకొక అవకాశం ఇస్తే.. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను వివరిస్తానన్నారు.

Next Story