- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ నాపై దుష్ప్రచారం చేస్తోంది.. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన సంపత్ కుమార్
తనపై వస్తున్న ఆరోపణలపై ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్పందించారు. సంపత్ కుమార్ నిప్పు, తనను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తనపై వస్తున్న ఆరోపణలపై ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్పందించారు. సంపత్ కుమార్ నిప్పు, తనను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. మంగళవారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘భ్రమరాంబ అనే కంపెనీ కింద భాషా అనే వ్యక్తి సబ్ కాంట్రాక్టర్ గా పని చేశారు, ఆయనకు భ్రమరాంబ కంపెనీ 13 లక్షలు ఇవ్వాలి.. ఇవ్వకపోతే ఇప్పించమని భాషా నన్ను కోరాడు.. ఆయన అడగడంతో నేను భ్రమరాంబ కంపెనీ జీఎంకు ఫోన్ చేసి భాషా కు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని చెప్పా.. అయినా భాషాకు డబ్బులు ఇవ్వలేదు.. ఆయనకు డబ్బులు ఇవ్వకుండానే మరో వ్యక్తితో భ్రమరాంబ కంపెనీ పనిచేయించుకోవడంతో భాషాకు మరో జేసీబీ డ్రైవర్‌కు గొడవ కావడంతో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది’ సంపత్ కుమార్ చెప్పారు.
రూ.8 లక్షలు కాస్తా రూ.8 కోట్లు చేసి వార్తలు రాశారని, బీఆర్ఎస్ అనుకూల మీడియా తనపై దుష్ప్రచారం చేసిందని సంపత్ కుమార్ ఆరోపించారు. కేటీఆర్ యూట్యూబ్ ఛానల్స్‌లో రూ.8 కోట్లు అని రాసి నాపై బురదజల్లే ప్రయత్నం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భ్రమరాంబ కంపెనీ నల్ల మట్టి అమ్ముతుంది..దీనిపై నేషనల్ హైవే అథారిటీ కి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. పాలమూరు ప్రజల భిక్షతో కేసీఆర్ ఎంపీ అయ్యారని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత పాలమూరును పట్టించుకోలేదు.. పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పాలమూరు ప్రాజెక్టుల పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిగెత్తి స్తున్నారని సంపత్ కుమార్ తెలిపారు.






