శవరాజకీయాలు చేయొద్దు: హరీశ్ రావుపై ఏఐసీసీ కార్యదర్శి ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్‌రావుపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ మండిపడ్డారు.....

శవరాజకీయాలు చేయొద్దు: హరీశ్ రావుపై ఏఐసీసీ కార్యదర్శి ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్‌రావు(Former BRS Minister Harish Rao)పై ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్(AICC Secretary Sampath Kumar) మండిపడ్డారు. ఇథనాల్ కంపెనీ(Ethanol Company) విషయంలో శవరాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్(Brs) రాజకీయ కుట్రలో భాగంగానే ధన్వాడ ఘటన(Dhanwada Incident) జరిగిందని ఆరోపించారు. రైతులపై BRS కార్యకర్తలు దాడులు చేశారని ధ్వజమెత్తారు. ఇథనాల్ కంపెనీకి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చాయని గుర్తు చేశారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. రైతుల భూములను ప్రభుత్వం లాక్కోలేదని, ప్రజల జీవితాలను హరీష్‌రావు రాజకీయంశవరాజకీయాలు చేయొద్దు: హరీశ్ రావుపై ఏఐసీసీ కార్యదర్శి ఆగ్రహం చేయొద్దని సంపత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Next Story