హరీష్ రావుకు మెంటల్ ఎక్కింది: ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్

by Ajay Maddhiboyina |

మాజీ మంత్రి హరీష్ రావుకు మెంటల్ ఎక్కినట్లు ఉందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ అన్నారు. శనివారం గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

హరీష్ రావుకు మెంటల్ ఎక్కింది: ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి హరీష్ రావుకు మెంటల్ ఎక్కినట్లు ఉందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ అన్నారు. శనివారం గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. హరీష్ రావుకు మాట్లాడానికి ఏం లేక అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. సీఎంపై అడ్డగోలుగా మాట్లాడితే దళిత సమాజం ఊరుకోదు. ప్రభుత్వం అవసరం ఉన్న ప్రతి చోటా విడుతల వారీగా నీళ్లు విడుదల చేస్తుంది. అది నిరంతరం చేసే ప్రక్రియ. హరీష్ రావు ముందే ఓవర్ యాక్షన్ చేస్తూ నీళ్లు విడుదల చేస్తారా లేదా? నేను వెళ్లి విడుదల చేస్తా అని ప్రకటనలు చేస్తాడు. ప్రభుత్వం నీటిని విడుదల చేయగానే నేను చెప్పిన కాబట్టి నీళ్లు విడుదల చేశారు అంటాడు. సాధారణంగా చేసే పనులను కూడా తానే చేయించినట్లు హరీష్ రావు ముందుకు ముందే డబ్బా కొటుకుంటాడు తప్పా మరొకటి లేదని విమర్శించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావుపై కూడా సంపత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రామచంద్రరావు ముద్ద పప్పు... ముద్దపప్పు సప్పగా, మెత్తగా ఉంటుందని పేర్కొన్నాడు. ఆయన కడలడు మేదలడు, మంచోడు సౌమ్యుడని ఎద్దేవా చేశాడు. దళితులను వాడుకొని కేటీఆర్ రాజకీయం చేస్తున్నాడని, 10 ఏళ్లు అధికారంలో ఉండి వారికి ఏం చేసిందే లేదని అన్నారు. ఉద్యమంలో దళితులు కీలక పాత్ర పోషించారు. దళితులను వాడుకొని అధికారంలో వచ్చిన కేటీఆర్ దళితులను మోసం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ దళిత ముఖ్యమంత్రిని చేస్తామని మోసం చేసింది. ఉప ముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్ చేసింది. దళితుల భూములు, నేరెళ్ళ ఘటనలో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన చరిత్ర ఉందని పేర్కొన్నారు.

అనేక మంది దళిత యువతి, యువకులను పొట్ట పెట్టుకున్న రోజులు ప్రజలు మరిచిపోలేదని గుర్తుచేశారు. దళిత పక్షపాతి అయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు....జాగత్ర అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటకి కట్టుబడి వర్గీకరణ చేసింది. గతంలో ఒక్కరూ కూడ దళితులు క్యాబినెట్ లో లేరు. ఇప్పుడు 4 మంత్రులు ఉన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించిన చరిత్ర మీది. రూ.30 వేల కోట్లు కేటాయించిన చరిత్ర మాది అంటూ కేటీఆర్ ను విమర్శించారు. అన్ని రంగాల్లో దళితులు అభివృద్ధి చెందుతున్నారని కుళ్ళుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. రాజ్యాంగ పరి రక్షకుడు, దళిత సంరక్షకుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story