తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ.. ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు

by Satheesh |
తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ.. ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన ‘‘యువ సంఘర్షణ సభ’’కు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌‌కు చేరుకున్న ప్రియాంక గాంధీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి ప్రియాంక గాంధీ హెలికాప్టర్‌లో సరూర్ నగర్ స్టేడియానికి బయలుదేరనున్నారు. ఇక, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులే టార్గెట్‌గా హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో ‘‘యువ సంఘర్షణ సభ’’ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రియాంక గాంధీ నిరుద్యోగ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు.

Next Story

Most Viewed