- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఒక్క పని మీరు పక్కాగా చేస్తే చాలు.. కాంగ్రెస్ నేతలకు AICC ఇన్‌చార్జి మీనాక్షి కీలక టాస్క్
తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) నేతలకు ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్(AICC in-charge Meenakshi Natarajan) కీలక సూచనలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) నేతలకు ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్(AICC in-charge Meenakshi Natarajan) కీలక సూచనలు చేశారు. శుక్రవారం ఆమె గాంధీ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం.. పేద వాడి కోసం పని చేయాలి. పేదల ముఖంలో నవ్వులు చూడాలి.. అప్పుడే మనం పని చేసినట్టు అని అన్నారు. కాంగ్రెస్(Congress) కార్యకర్తలకు ఎంతో పోరాట శక్తి ఉంది.. అనేక రకాలుగా పోరాటాలు చేసాం.. అందుకే తెలంగాణలో అధికారంలోకి వచ్చామని తెలిపారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాజ్యాంగ రక్షణ కోసం భారత్ జొడో యాత్ర నిర్వహించి ఒక మైదానాన్ని తయారు చేశారు. మనం దాని కోసం పోరాటం చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్రాన్ని తెచ్చింది.. కాంగ్రెస్ ఎలాంటి పోరాటానికి అయిన సిద్ధంగా ఉన్నామని కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అనేక కార్యక్రమాలు చేపట్టింది.. ఇవన్నీ ప్రజలకు సక్రమంగా అందాలి.. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేశారు.. వారికి న్యాయం జరగాలి.. పదవులు పొందిన వారు ప్రజల కోసం పని చేయాలి.. మనం చేసిన పనులను ప్రజలకు వివరించాలని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కులగణన(Caste Census) చేపట్టాం.. ఇది చాలా గొప్ప విషయం అని అభినందించారు. ప్రతి గ్రామ గ్రామానికి వెళ్లి ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని తెలిపారు. గ్రామ గ్రామాన పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని అన్నారు. ఈ విషయంలో పీసీసీ(PCC) ఒక పకడ్బందీగా క్యాలెండర్ సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.






