- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP ఆఫీసుల ముట్టడికి AICC పిలుపు.. గాంధీభవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపిస్తూ.. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ (BJP) కార్యాలయాల ముట్టడికి పిలపునిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపిస్తూ.. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ (BJP) కార్యాలయాల ముట్టడికి పిలపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అదేవిధంగా మరోవైపు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతను సమీక్షిస్తున్నారు. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కాస్త ఊరట లభించిన విషయం తెలిసిందే. కేసులో ఆ ఇద్దరితో పాటు మరో ఐదుగురిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో చివరికి సత్యమే గెలిచిందని కాంగ్రెస్ నాయకులు కామెంట్ చేశారు.
అయితే, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతో ఈడీ (ED)ని దుర్వినియోగం చేసి తమ నాయకులపై తప్పుడు కేసులు పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ మేరకు దేశంలో అన్ని బీజేపీ కార్యాలయాలను ముట్టడించాలని ఏఐసీసీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీభవన్ నుంచి నాంపల్లి BJP కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించబోతున్నారు. ముందస్తు జాగ్రత్తగా కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాల ఎదట భారీగా పోలీసులు బలగాలు, బ్యారికేడ్లను ఏర్పాటు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.






