AI University : ఏఐ అంటే హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు

by Muthe.Rajitha |

భవిష్యత్తులో ఏఐ(AI) అంటే హైదరాబాద్(Hyderabad) గుర్తుకు వచ్చేలా తెలంగాణ(Telangana)ను తీర్చిదిద్దుతాం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు(Minister D Sridhar Babu) పేర్కొన్నారు.

AI University : ఏఐ అంటే హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్ : భవిష్యత్తులో ఏఐ(AI) అంటే హైదరాబాద్(Hyderabad) గుర్తుకు వచ్చేలా తెలంగాణ(Telangana)ను తీర్చిదిద్దుతాం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు(Minister D Sridhar Babu) పేర్కొన్నారు. వరల్డ్ వైడ్ గా సేవలు అందిస్తోన్న డీటీసీసీ(DTCC) నూతన కార్యాలయాన్ని సోమవారం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీటీసీసీ సంస్థ భారత్ లో తన రెండవ ఆఫీసును హైదరాబాద్ లో ప్రారంభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 500 మందికి కొత్త ఉద్యోగాలు రానున్నాయని, ముందు ముందు 2000 మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. ఈ ఉద్యోగాల్లో అధిక శాతం స్థానిక యువతకి మాత్రమే ఇవ్వాలన్న తమ కోరికను సంస్థ ఒప్పుకుందని మంత్రి అన్నారు.

తెలంగాణ యూత్ ను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intellegence) లో నెం.1 గా నిలపాలనేదే తమ లక్ష్యం అన్నారు. అందుకోసం రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీని(AI University) నెలకొల్పుతున్నట్టు ప్రకటించారు. 200 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏఐ వర్శిటీ నిర్మించబోతున్నట్టు తెలియ జేశారు. యువతీ యువకులు అందరికంటే వినూత్నంగా ఆలోచించినపుడే కొత్త స్టార్ట్ అప్స్ వస్తాయని.. ఆ దిశగా దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి దాదాపు 200 కంపెనీలు ప్రపంచంలోని అనేక దేశాలకు తమ ఆర్థిక సేవలు అందిస్తున్నాయని తెలిపారు. అన్ని రకాల పరిశ్రమలు స్థాపించేందుకు ఇక్కడ అనుకూల వతావారం ఉందని, ప్రభుత్వం కూడా కంపెనీలకు ప్రోత్సాహకాలను, మానవ వనరులను అందించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలియ జేశారు.

Next Story