తీన్మార్ మల్లన్న అలాంటివాడు..AI చెప్పిన సంచలన విషయాలు ఇవే

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-17 13:43:23  IST  )

మల్లన్న పార్టీని ప్రకటించిన తరవాత తమ పార్టీ కొత్త అధికార ప్రతినిధి AI (ఆర్టిఫీషియల్ ఇంటిజెన్స్) అని చెప్పడంతో.. మ‌ల్ల‌న్న గురించి ఏఐ చెబుతుంది ఇదే అంటూ పోస్టులో పేర్కొన్నాడు. పోస్టులో... తీన్మార్ మ‌ల్ల‌న్న‌గా ప్రసిద్ధి చెందిన చింతపండు నవీన్ పై అనేక ఆరోపణలు ఉన్నాయని ఏఐ చెబుతోంది. గ‌తంలో చింత‌పండు న‌వీన్ కుమార్ ఓ మ‌హిళ‌ను అక్ర‌మ ర‌వాణా చేసిన‌ట్టు పేర్కొంది.

తీన్మార్ మల్లన్న అలాంటివాడు..AI చెప్పిన సంచలన విషయాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ యూట్యూబర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar mallanna) తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీగా గెలిచిన మల్లన్న తరవాత సొంత పార్టీని ప్రశ్నిస్తూ సస్పెన్షన్‌కు గురయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ సర్కార్‌ను గద్దె దింపడంలో మల్లన్న పాత్ర కూడా ఉంది. తన మీడియా ద్వారా కేసీఆర్ ప్రభుత్వంపై మల్లన్న ఎన్నో విమర్శలు, ఆరోపణలు చేశారు. ఇప్పుడు మల్లన్న పార్టీని ప్రకటించడంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆయనను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సోషల్ మీడియాకు చెందిన ఓ వ్యక్తి చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.

మల్లన్న పార్టీని ప్రకటించిన తరవాత తమ పార్టీ కొత్త అధికార ప్రతినిధి AI (ఆర్టిఫీషియల్ ఇంటిజెన్స్) అని చెప్పడంతో.. మ‌ల్ల‌న్న గురించి ఏఐ చెబుతుంది ఇదే అంటూ పోస్టులో పేర్కొన్నాడు. పోస్టులో... తీన్మార్ మ‌ల్ల‌న్న‌గా ప్రసిద్ధి చెందిన చింతపండు నవీన్ పై అనేక ఆరోపణలు ఉన్నాయని ఏఐ చెబుతోంది. గ‌తంలో చింత‌పండు న‌వీన్ కుమార్ ఓ మ‌హిళ‌ను అక్ర‌మ ర‌వాణా చేసిన‌ట్టు పేర్కొంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆయ‌న డ‌బ్బులు వ‌సూలు చేసిన‌ట్టు తెలిపింది. బ్లాక్ మెయిలింగ్‌కు సైతం పాల్పడుతూ కొందరి వద్ద డబ్బులు తీసుకున్నట్టు పేర్కొంది. నకిలీ పత్రాలను క్రియేట్ చేసి అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డాడని, సైబర్ నేరాలకు పాల్పడ్డాడని సైతం ఏఐ చెబుతోంది. మల్లన్న మహిళలను సైతం వేధించాడని గతంలో కేసులు నమోదయ్యాయని తెలిపింది.

ఇదిలా ఉంటే తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో ముందుకు వెళుతున్నారు. బీసీలకు రాజ్యాధికారమే తన అజెండాగా ప్రకటించుకున్నారు. పార్టీ కార్యవర్గంలో యువతకే ప్రాధాన్యం ఇస్తామని, వాళ్లే పార్టీని ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు. ఇక పార్టీకి తానే అధ్యక్షుడిగా వ్యవరిస్తుండగా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మాదం రజినీకుమార్ యాదవ్, సంగెం సూర్యరావు, పల్లెబోయిన అశోక్ యాదవ్, జ్యోతి పండల్ పేర్లను ప్రకటించారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాత్రమే పోటీ ఉండగా మల్లన్న పార్టీ ఎంతమేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.

Next Story