AI: 2030 నాటికి ఏఐకి మానవ తెలివితేటలు.. గూగుల్ డీప్ మైండ్ పరిశోధనలో సంచలన విషయాలు

by Prasad Jukanti |   (  Updated:2025-04-07 05:37:58  IST  )

ఏఐ మానవ తెలివితేటలు రాబోతున్నాయని దాంతో మానవ అస్తిత్వాన్ని శాశ్వతంగా నాశనం చేస్తుందన గూగుల్ పరిశోధనలో వెల్లడైంది.

AI: 2030 నాటికి ఏఐకి మానవ తెలివితేటలు.. గూగుల్ డీప్ మైండ్ పరిశోధనలో సంచలన విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మానవ ఆవిష్కరణల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) రోజు రోజుకు మరింత అడ్వాన్స్ గా మారుతోంది. అభివృద్ధి చెందిన వెర్షన్లతో అన్ని రంగాల్లో ఏఐ దూసుకోవస్తోంది. ఈ క్రమంలో తాజాగా గూగుల్ డీప్ మైండ్ (Google DeepMind) వెలువరించిన పరిశోధన పత్రంలో షాకింగ్ అంశాలు వెలుగు చూశారు. 2030 నాటికి కృత్రిమ మేధ మానవ వేధస్సును మించిపోతుందని ఈ పరిశోధన అంచనా వేసింది. డీప్ మైండ్ సహ వ్యవస్థాపకుడు షేగ్ లెగ్ సహ రచయితగా రాసిన 145 పేజీల ఈ పరిశోధన పత్రంలో ఏఐకి మానవ తెలివితేటలు రావడంతో పాటు మానవులతో సమానంగా పని చేయగల ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) అభివృద్ధి చెందుతుందని పేర్కొంది. ఈ పరిణామంలో మానవ అస్తిత్వం సంక్షోభంలో పడి అది మానవత్వాన్ని శాశ్వతంగా నాశనం చేస్తుందని హెచ్చరించింది. ఏజీఐ వల్ల కలిగే నష్టాలను ఈ పరిశోధన పత్రం నాలుగు వర్గాలుగా విభజించింది. మిస్ యూజ్, మిస్ అలైన్ మెంట్, మిస్టేక్స్, స్ట్రక్చరల్ రిస్క్ వంటి అంశాలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. వీటిని నివారించడానికి డెవలపర్లు భద్రతా ప్రోటోకాల్ సృష్టించి అభివృద్ధి చేయడంతో పాటు అలాంటి పనులు చేసే విషయంలో సిస్టమ్ సామార్థ్యాలను గుర్తించి పరిమితం చేయాలని అని ఈ పరిశోధన పత్రం స్పష్టం చేసింది.

Next Story