అగ్రికల్చర్​ వర్సిటీ అద్భుత ప్రగతి : గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

by Muthe.Rajitha |

అగ్రికల్చర్​యూనివర్శిటీ ప్రవేశాల్లో వ్యవసాయ కూలీల పిల్లలకు 15 శాతం సీట్లు కేటాయించడంపై గవర్నర్ జిష్ణదేవ్​శర్మ ప్రశంసించారు.

అగ్రికల్చర్​ వర్సిటీ అద్భుత ప్రగతి : గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
X

దిశ, తెలంగాణ బ్యూరో : అగ్రికల్చర్​యూనివర్శిటీ ప్రవేశాల్లో వ్యవసాయ కూలీల పిల్లలకు 15 శాతం సీట్లు కేటాయించడంపై గవర్నర్ జిష్ణదేవ్​శర్మ ప్రశంసించారు. ఎన్​ఐఆర్​ఎఫ్​​ర్యాంకుల్లో యూనివర్శిటీ 37వ ర్యాంకు నుండి 24 వ స్థానానికి ఎగబాకడం ఎంతో అభినందనీయమన్నారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయం విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య లోక్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అగ్రి కల్చర్​యూనివర్శిటీ ప్రగతి నివేదికను గవర్నర్ విడుదల చేసి సాధిస్తున్న ప్రగతిని అభినందించారు.

ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ మంచి పనితీరు కనపరచాలని, అత్యుత్తమ ర్యాంకులు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న మూడు బ్యాచ్ లకు కలిపి ఒకే స్నాతకోత్సవాన్ని నిర్వహించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా అల్దాస్ జానయ్య చేసిన విజ్ఞప్తిని గవర్నర్, ఛాన్స్ లర్ అంగీకరించారు. త్వరలోనే స్నాతకోత్సవం తేదీలను ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో మూడు బ్యాచ్ లకు చెందిన 2800 యుజీ, పీజీ, పీహెచ్​డీ విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నట్లు జానయ్య తెలిపారు. ఈ భేటీలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ మల్లారెడ్డి కూడా ఉన్నారు.

Next Story