- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదర్శ రైతుల కోసం ఆఫీసర్ల ఎదురుచూపులు
రాష్ట్రంలో అన్నదాతలు సకాలంలో సేవలందించేందుకు ఆదర్శ రైతులను నియమించాలని వ్యవసాయ విస్తరణాధికారుల నుంచి డిమాండ్ వస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అన్నదాతలు సకాలంలో సేవలందించేందుకు ఆదర్శ రైతులను నియమించాలని వ్యవసాయ విస్తరణాధికారుల నుంచి డిమాండ్ వస్తోంది. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో ఆశించిన మేరకు సేవలు అందించడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా 2,604 క్లస్టర్లు ఉండగా వాటికి ఒక ఏఈవోను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక క్లస్టర్పరిధిలో 5 వేల ఎకరాలు ఉండాలి దానికి ఒక విస్తరణాధికారి ఉండాలి. ప్రస్తుతం ఒక ఏఈవో 10 వేల నుంచి 27 వేల వరకు సేవలందిస్తున్నారు. ముగ్గురు ఉద్యోగులు చేయాల్సిన పని ఒకరే నిర్వహిస్తున్నారు. దీంతో రైతులు దరఖాస్తులు పెట్టుకుంటే వారం రోజుల్లో పరిష్కారం చూపుతున్నారు. అదే ఆదర్శ రైతులు ఉంటే వెయ్యి ఎకరాలకు ఒకరు ఉంటారు. ప్రతి గ్రామానికి ఇద్దరు ఉంటారు. వీరు ఏఈవోలకు సహయకులుగా ఉంటూ ప్రభుత్వం చేపట్టే పథకాలను రైతులకు చేరవేస్తారు. ఏదైనా సమస్య వచ్చిన వారు దానికి వెంటనే పరిష్కారం చూపి రైతులకు అండగా నిలుస్తారు. ప్రస్తుతం వారు లేకపోవడంతో విస్తరణాధికారులకు మోయలేని భారం పడుతుంది. వ్యవసాయ శాఖకు సంబంధించిన 49 పనులతో పాటు ఎన్నికల సమయంలో పోలింగ్ఆఫీసర్లుగా విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఇతర పనులకు వెళ్లితే వారు వచ్చేంత వరకు రైతులు ఎలాంటి సమస్య ఉన్న ఆగాల్సిందే. ఆదే ఆదర్శ రైతులుంటే వారు దగ్గరుండి కావాల్సిన సహాయం చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 16 వేల మంది ఆదర్శ రైతులు నియామకం చేపట్టారు. వారికి ప్రభుత్వం గౌరవ వేతనం నెలకు రూ.1000లు చెల్లించింది. వారే మరోసారి ఆదర్శ రైతులుగా సేవలందిస్తామని, ఎలాంటి వేతనం లేకుండా ఉచితంగా చేస్తామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం తమను విధుల్లోకి తీసుకోవాలని పలుమార్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ప్రజా ప్రభుత్వంలో తాము భాగస్వాములై ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటుకు కృషి చేస్తామని చెబుతున్నారు.
ధాన్యం, పత్తి సేకరణలో రైతుల అవస్థలు
రాష్ట్రంలో గత రెండు నెలల నుంచి ధాన్యం సేకరణ, నెల రోజుల నుంచి పత్తి కొనుగోలు జరుగుతుంది. ధాన్యం సొమ్ము రైతుల ఖాతాలో పడాలంటే ఏఈవో ఆమోదం అవసరం. అదే విధంగా పత్తి కూడా ఎకరానికి 7 క్వింటాళ్ల వరకు రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాల వద్ద అమ్ముకోవచ్చు. అంతకు మించి పండిస్తే ఎకరానికి 12 క్వింటాళ్ల చొప్ప విక్రయించేందుకు ఏఈవో ధృవీకరణ చేయాలి. ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరగడంతో వ్యవసాయ శాఖ అధికారులు ఎన్నికల విధులకు వెళ్లారు. దీంతో ఆయా గ్రామాల పరిధిలోని రైతులు వరి, పత్తి కొనుగోలు చేపట్టకుండా వారి కోసం ఎదురు చూడక తప్పలేదు. వీరికి సహాయంగా ఆదర్శ రైతులు ఉంటే పండిన పంట రైతులు అమ్మకోవడానికి సమస్యలు ఉండవు.
స్వచ్చందగా సేవలందిస్తామంటున్న ఆదర్శ రైతులు
ప్రభుత్వం గతంలో పనిచేసిన ఆదర్శ రైతులను నియమిస్తే అన్నదాతల కోసం ఎలాంటి వేతనం లేకుండా స్వచ్చందంగా పనిచేస్తామంటూ ముందుకొస్తున్నారు. గత ఏడాది నుంచి ఆదర్శ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. లింగయ్య యాదవ్వ్యవసాయశాఖ అధికారులతో పాటు రైతు కమిషన్చైర్మన్కోదండరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తమను తిరిగి తీసుకోవాలని కోరారు. వారు కూడా త్వరలో ఉన్నతాధికారులతో చర్చించి తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ, నేటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. స్ధానిక ఎన్నికలు ముగియడంతో మరోసారి ప్రభుత్వం పెద్దలను కలిసేందుకు ఆదర్శ రైతులు సిద్ధమయ్యారు.






