యూరియా సరఫరాలో ఆలస్యానికి చింతిస్తున్నాం.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆవేదన

by Ramesh Naini |   (  Updated:2025-08-25 10:27:07  IST  )

కేంద్రం తరఫున రాష్ట్ర రైతాంగానికి యూరియా సరఫరాలో ఆలస్యానికి చింతిస్తున్నాము అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

యూరియా సరఫరాలో ఆలస్యానికి చింతిస్తున్నాం.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆవేదన
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కేంద్రం తరఫున రాష్ట్ర రైతాంగానికి (urea supply) యూరియా సరఫరాలో ఆలస్యానికి చింతిస్తున్నాము అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రంపై ఒత్తిడితో ఈ వారం రోజుల్లో రాష్ట్రానికి 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన యూరియాను తక్షణమే డిమాండ్‌కు అనుగుణంగా జిల్లాలకు పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి‌కి మంత్రి తుమ్మల ఆదేశించారు. కేంద్రం (Central Government) అసమర్థతతో ఇతర దేశాల నుంచి దిగుమతి యూరియాను తెప్పించి, రాష్ట్రాలకు యూరియా సరఫరా చేయడంలో ఘోర వైఫల్యం చెందిందని మంత్రి విమర్శించారు. కేంద్ర వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేయోద్దని హితవుపలికారు. రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే తెప్పించడానికి ఎంత వరకైనా పోరాడతామని తేల్చి చెప్పారు. ఆర్ఎఫ్‌సీఎల్ (RFCL) నుంచి రావాల్సిన యూరియాను తెప్పించడానికి ఇప్పటికే RFCL ఎండీతో మాట్లాడినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పాత నిల్వలతో కలుపుకొని 7.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించడం జరిగిందని మంత్రి తుమ్మల వెల్లడించారు.

Next Story