‘ఆ విషయంలో తెలంగాణ రైతు కమిషన్ సక్సెస్’

by Gantepaka Srikanth |

గత బీఆర్​ఎస్ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో నెట్టబడిందని, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని రైతు కమిషన్​చైర్మన్​కోదండ రెడ్డి అన్నారు.

‘ఆ విషయంలో తెలంగాణ రైతు కమిషన్ సక్సెస్’
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత బీఆర్​ఎస్ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో నెట్టబడిందని, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని రైతు కమిషన్​చైర్మన్​కోదండ రెడ్డి అన్నారు. సోమవారం తమ కార్యాలయంలో ప్రొఫెసర్ హరగోపాల్, వ్యవసాయ రంగ ఆర్థిక నిపుణులు డి.నర్సింహారెడ్డితో పాటు కమిషన్ సభ్యులు భవానీ రెడ్డి, గడుగు గంగాధర్, భూమి సునీల్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, వ్యవసాయం రంగంలో రావాల్సిన మార్పులపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. ములుగు, గద్వాల్‌లో విత్తనోత్పత్తి రైతులకు విత్తన కంపెనీల నుండి నష్టపరిహారం ఇప్పించడంలో కమిషన్ సక్సెస్ అయ్యిందన్నారు. కమిషన్ అద్భుతంగా పని చేస్తుందని రైతులకు నిత్యం అందుబాటులో ఉంటున్న విషయాన్ని తెలుసుకున్నట్లు హరగోపాల్ తెలిపారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇవ్వడంతో చాలామంది రైతులు వరి సాగు మొగ్గు చూపుతున్నారు. మిగతా పంటల విస్తీర్ణం తగ్గకుండా చూడాలన్నారు. విత్తన చట్టం వస్తే రైతులకు మరింత లాభం జరిగే అవకాశం ఉందని హరగోపాల్, వ్యవసాయ రంగ ఆర్ధిక నిపుణులు నర్సింహా రెడ్డి అభిప్రాయ పడ్డారు. కౌలు రైతుల సమస్యలు, ప్రైవేట్ అప్పుల భారంతో రైతులు ఆత్మహత్యలకు చేసుకున్న ఘటనలపై ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story