వ్యవసాయ శాఖ ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే వేటు

by Muthe.Rajitha |

వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ కార్పొరేషన్ల కార్యాలయాల్లో డివిజన్ స్దాయి ఉద్యోగుల వరకు హాజరుపై నిర్లక్ష్యం చేయకుండా బయో మెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాలు జారీ చేశారు.

వ్యవసాయ శాఖ ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే వేటు
X

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ కార్పొరేషన్ల కార్యాలయాల్లో డివిజన్ స్దాయి ఉద్యోగుల వరకు హాజరుపై నిర్లక్ష్యం చేయకుండా బయో మెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ప్రజా పాలనలో రైతాంగం సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అమలులో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కొందరు ఉద్యోగులతో అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నారు.

ఉద్యోగులు విధుల విషయంలో ఎంతో జవాబుదారిగా ఉండాలని సూచించారు. ఇటీవల పలు హెచ్ ఓ డీ కార్యాలయాలు ఆకస్మిక తనిఖీలు చేయగా ఉద్యోగులు ఆలస్యంగా విధులకు హాజరవుతున్న విషయం గుర్తించి విధులు పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగుల పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేందర్ మోహన్ ను ఆదేశించారు. వ్యవసాయ శాఖ పరిధిలోని అనుబంధ శాఖలు, కార్పొరేషన్ల కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరుపై నిర్లక్ష్యం లేకుండా ఉండేలా బయో మెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఏర్పాటు చేయాలని హెచ్ ఓ డీ లకు కార్యదర్శి సురేందర్ మోహన్ ఆదేశాలు జారీ చేశారు.

విధులకు ఆలస్యంగా హాజరయ్యే ఉద్యోగుల పట్ల తీసుకున్న యాక్షన్ టేకెన్ రిపోర్టు లు అందించాల్సిందిగా సూచించారు. ఐటీ శాఖతో మాట్లాడి డాష్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ శాఖ పరిధిలోని అనుబంధ కార్పొరేషన్ల కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరుపై ఆన్ లైన్ లో సమాచారం ఉండే విధంగా డాష్ బోర్డు పనిచేయాలని ఐటీ డిపార్ట్ మెంట్ వారికి పనులు అప్పగించారు. కొద్ది రోజుల్లో వ్యవసాయ శాఖ, అనుబంధ కార్పొరేషన్ల కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకుంటున్నామని సురేందర్ మోహన్ వెల్లడించారు.

Next Story