ఇంటి నుంచే యూరియా బుకింగ్.. విజయవంతంగా​ సాగుతోంది : వ్యవసాయ శాఖ డైరెక్టర్​

by Ramesh Naini |

రాష్ట్రంలో ఇటీవల ప్రవేశపెట్టిన యూరియా యాప్​ విజయవంతంగా సాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్​ బి. గోపి తెలిపారు.

ఇంటి నుంచే యూరియా బుకింగ్.. విజయవంతంగా​ సాగుతోంది : వ్యవసాయ శాఖ డైరెక్టర్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇటీవల ప్రవేశపెట్టిన యూరియా యాప్​ విజయవంతంగా సాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్​ బి. గోపి తెలిపారు. రైతులు ఇంటి నుంచి సులభంగా యూరియా బుక్ చేసుకుంటున్నట్లు వెల్లడించారు. గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ, పైలట్ ప్రాజెక్టు కింద ఈ నెల 22 నుంచి ఐదు జిల్లాలో వ్యవసాయ శాఖ అమలు చేస్తుందని, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, జనగాం, పెద్దపల్లి జిల్లాలో అన్నదాతలు ముందుకు వస్తున్నట్లు చెప్పారు.

మిగతా జిల్లాలో ఎప్పటి మాదిరిగా కొనుగోలు కేంద్రాల వద్దనే రైతులు యూరియా తీసుకోవాలన్నారు. ఐదు జిల్లాలో మూడు రోజుల్లో యాప్ ద్వారా 37,264 మంది రైతులు యూరియా బుక్ చేసుకున్నారు. లక్షా 15 వేల 534 యూరియా బస్తాలను యాప్ ద్వారా బుక్ చేసి కొనుగోలు జరిగిందన్నారు. విడతల వారీగా మిగతా జిల్లాలో కూడా యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి రానుంది. పైలట్ జిల్లాలు తప్పా మిగతా జిల్లాల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేరుగా యూరియా కొనుగోలు చేయవచ్చని సూచించారు.

Next Story