ములుగు ఘటన రిపీట్ కాకుండా చూడాలి : సీఎస్ కు వ్యవసాయ రైతుసంక్షేమ కమిషన్ నివేదిక

by Muthe.Rajitha |

విత్తనం, వ్యవసాయ మార్కెట్ చట్టాల్లో వెంటనే సవరణలు చేయాలని, రైతు హక్కులు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచన చేస్తున్నట్లు రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భవానీ రెడ్డి, భూమి సునీల్, వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు. తెలిపారు.

ములుగు ఘటన రిపీట్ కాకుండా చూడాలి :  సీఎస్ కు వ్యవసాయ రైతుసంక్షేమ కమిషన్ నివేదిక
X

దిశ, తెలంగాణ బ్యూరో : విత్తనం, వ్యవసాయ మార్కెట్ చట్టాల్లో వెంటనే సవరణలు చేయాలని, రైతు హక్కులు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచన చేస్తున్నట్లు రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భవానీ రెడ్డి, భూమి సునీల్, వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు. తెలిపారు. ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనాలతో తీవ్రంగా నష్టపోయిన గిరిజన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి నివేదికను సచివాలయంలో శుక్రవారం సమర్పించారు. ములుగు ఘటన రిపీట్ కాకుండా చూడాలని కోరారు. నిజనిర్ధారణ కమిటీ వేసి క్షేత్ర స్థాయిలో పర్యటించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు కమీషన్ సభ్యలు వెల్లడించారు. తెలంగాణ వ్యవసాయ మార్కెట్ల చట్టం, విత్తన చట్టంలో తేవాల్సిన మార్పులపై వ్యవసాయ కమిషన్ పలు సూచనలు చేసినట్లు తెలిపారు.

వ్యవసాయ మార్కెట్ల చట్టంలోని కాంట్రాక్టు వ్యవసాయానికి సంబందించిన సెక్షన్ 11ఏ లో గత బిఆర్ఎస్ ప్రభుత్వం మార్పు చేసి, కంపెనీలకు ఎలాంటి బాధ్యత లేకుండా ఆర్గనైజర్ల వ్యవస్థను తీసుకొచ్చిందని అన్నారు. ఈ సెక్షన్ ను సవరించి 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను కొనసాగించాలని సూచించినట్లు తెలిపారు. కేంద్రం చేసిన విత్తన చట్టంలో నకిలీ విత్తనాల తయారీ, అమ్మకాలు చేసే కంపెనీలపై చర్యలు తీసుకోడానికి కఠిన తరమైన నిబంధనలు లేవని వెల్లడించారు. మహారాష్ట్రలో చేసినట్లుగా విత్తన చట్టం సవరించి నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న వ్యవసాయ శాఖ పేరును వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ గా మార్చాలని సూచించారు.

Next Story