- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Urea: యూరియా అతిగా వాడొద్దు : వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి జానయ్య
ఇటీవల వివిధ జిల్లాల్లో తాము సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్రంలోని అధిక శాతం రైతాంగం వివిధ పంటల్లో శాస్త్రీయ అవసరానికి మించి 50 నుంచి 100 శాతం అధికంగా యూరియా వాడుతున్నట్లు తెలుస్తున్నదని అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల వివిధ జిల్లాల్లో తాము సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్రంలోని అధిక శాతం రైతాంగం వివిధ పంటల్లో శాస్త్రీయ అవసరానికి మించి 50 నుంచి 100 శాతం అధికంగా యూరియా వాడుతున్నట్లు తెలుస్తున్నదని అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. యూరియా ఎక్కువగా వాడితే అధిక దిగుబడులు వస్తాయని రైతాంగం లో అపోహ ఉందని, అది సరికాదన్నారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ అధికంగా యూరియా వాడడంతో అధిక దిగుబడులు రాకపోగా ఆయా పంట ఉత్పత్తులలో రసాయన అవశేషాలు నిండిపోయి తద్వారా మానవ అనారోగ్యానికి దారి తీస్తుందని వివిధ శాస్త్రీయ ప్రయోగాలు నిరూపించాయని పేర్కొన్నారు. అంతే కాకుండా నేలలో కూడా రసాయన అవశేషాలు పేరుకుపోయే ప్రమాదం ఉంటుందని తద్వారా నేలలోని పోషకాల లభ్యత, నాణ్యత తగ్గిపోతుందన్నారు. అధిక యూరియా వాడకంతో మొక్కల్లో నిరోధక శక్తి తగ్గుతుందని, చీడ పీడల బెడద పెరుగుతుందనీ వాటి నివారణకు అధికంగా క్రిమిసంహారకాలు వాడాల్సి వస్తుందని గుర్తు చేశారు. మొక్కలకు నత్రజని అవసరమే కానీ అందుకు ఎక్కువగా యూరియా వాడాల్సిన అవసరం లేదని రైతులకు సూచించారు. ఇతర ఎరువుల కంటే చౌకగా యూరియా దొరుకుతుందని రైతులు యూరియాను ఎక్కువగా వాడవద్దని కోరారు. అవసరాల మేరకే యూరియా వాడి నేల, నీళ్ళ లభ్యత, నాణ్యత లని కాపాడుతూ భవిష్యత్ తరాల ప్రయోజనాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.
సంతానోత్పత్తి శక్తి తగ్గే ప్రమాదం
ఇటీవల నిర్వహించిన వివిధ ప్రాథమిక ప్రయోగ ఫలితాల ఆధారంగా అధిక యూరియా తో పండించిన ఆహార పంటల వినియోగం కారణంగా వివిధ జంతువులలో సంతానోత్పత్తి తగ్గుతుందని తెలిపారు. యూరియా అధిక వాడకంతో పండిన ఆహార ఉత్పత్తుల వినియోగంతో క్యాన్సర్, కిడ్నీ సంబంధిత ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, యువత లోనూ సంతానోత్పత్తి శక్తి తగ్గే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2022 లో యునైటెడ్నేషన్ ఎనిర్వాల్మెంట్అసెంబ్లీ విడుదల చేసిన కెమికల్ఫెర్టిలైజర్, హెల్త్అనే నివేదిక ఈ అంశాన్ని పేర్కొందని తెలిపారు.ఈ అంశంపై వ్యవసాయ వర్సిటీలోని ఆహార, పోషణ పదార్థాల విభాగం ద్వారా మరింత లోతుగా పరిశోధనలు నిర్వహిస్తామని ప్రకటించారు.






