- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Agricultural Exhibition: రేపటినుంచే హైదరాబాద్‌లో రైతుల పండుగ
హైదరాబాద్‌లో అగ్రి షో పేరుతో ఈ నెల 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు అతి పెద్ద వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో అగ్రి షో పేరుతో ఈ నెల 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు అతి పెద్ద వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్యాంక్ బండ్ దిగువన, ఇందిరా పార్క్ (ధర్నా చౌక్) పక్కన ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మూడు రోజుల్లో వేలాది మంది రైతులు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేపడుతున్నామని అన్నారు. దేశ, విదేశాలకు చెందిన నూతన వ్యవసాయ సాంకేతికతను వివరించేందుకు వందల కంపెనీలు ఈ ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. నూతన యంత్రాలు, ఏఐ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, విత్తనాలు, మొక్కలు, ఎరువులు, డ్రిప్ పరికరాల వంటివి ఎన్నో ప్రదర్శనకు వస్తాయని, మూడు రోజుల్లో పలు అంశాలపై సదస్సులు సైతం జరుగుతాయని వివరించారు. సందర్శకులు ముందుగానే www.rbagrishow.com వెబ్ సైట్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చని, అలా చేసుకోలేని వాళ్లు నేరుగా రావచ్చని తెలిపారు.






