SUN PERTO : తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం సంతోషకరం : సన్ పెట్రో కీలక ప్రకటన

by Y. Venkata Narasimha Reddy |

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government)తో ఒప్పందం(MOU) చేసుకోవడం సంతోషకరం అని ప్రకటించిన సన్ పెట్రో(Sun Petrochemicals) సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది.

SUN PERTO : తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం సంతోషకరం : సన్ పెట్రో కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Government)తో ఒప్పందం(MOU) చేసుకోవడం సంతోషకరం అని ప్రకటించిన సన్ పెట్రో(Sun Petrochemicals) సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనను సీఎం రేవంత్ రెడ్డీ సీపీఆర్వో బోరెడ్డి అయోధ్య రెడ్డి ఎక్స్ లో పోస్టు చేశారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు(WEF) వేదికగా తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంవోయుతో తెలంగాణలో నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 3,400మెగావాట్ల స్టోరేజీ హైడ్రో విద్యుత్తు ప్లాంటులు, 5,440మెగావాట్ల సోలార్ విద్యు్త్తు ప్లాంట్లు ఏర్పాటు..7 వేల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా.. రూ. 45,500 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టుగా సన్ పెట్రో ఎండీ షాంఘ్వీ ప్రకటించారు.

తెలంగాణలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయన్న ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం, ఇంధన డిమాండ్లను పరిష్కరించడం, గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల సాధనలో తెలంగాణ ఆశయ సాధనకు మద్ధుతుగా ప్రభుత్వంతో తమ ఒప్పందం తోడ్పాటునిస్తుందని సంస్థ ఎండీ షాంఘ్వీ స్పష్టం చేశారు.

Next Story