- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో 'అజిలిషియమ్' భారీ పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో తెలంగాణ నిరుద్యోగులకు 2,000 కొత్త ఉద్యోగాలను ఇవ్వనున్నామని అజిలిషియమ్ సీఈఓ రాజ్ బాబు అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో తెలంగాణ నిరుద్యోగులకు 2,000 కొత్త ఉద్యోగాలను ఇవ్వనున్నామని అజిలిషియమ్ సీఈఓ రాజ్ బాబు అన్నారు. బయో ఏసియా 2025 సమావేశంలో ఆయన బుధవారం మాట్లాడుతూ ఇప్పటికే హైదరాబాద్‌లోని సైబర్సిటీలో సుమారు రూ. 500 కోట్ల పెట్టుబడులతో తమ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. తమ అజిలిషియమ్విస్తరణ లో భాగంగామరో 50 కోట్ల పెట్టుబడులతో టాలెంట్డెవలప్మెంట్ ల్యాబ్ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల శాఖతో ఎంఓయూ కుదుర్చుకున్నామన్నారు. అంతేకాకుండా ప్రపంచంలోని ప్రముఖ లైఫ్ సైన్సెస్ క్లస్టర్‌లలో ఒకటిగా అవతరించే తెలంగాణ విజన్‌కు తాము మద్దతు ఇస్తామని సీఈఓ రాజ్ బాబు వెల్లడించారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్రంజన్తో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా తమ సంస్థను అభినందించారని తెలిపారు.
ముఖ్యంగా "లైఫ్ సైన్సెస్ పరిశ్రమ ఒక పరివర్తన దశలో ఉంది. ఇక్కడ డేటా ఆధారిత ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికత నైపుణ్యం కలిగిన ప్రతిభ దీని ప్రాధాన్యత. లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ టాలెంట్ డెవలప్‌మెంట్ ల్యాబ్‌ను తాము ప్రారంభించడంతో పాటు తెలంగాణ అభివృద్దిలోనూ భాగస్వాములం అవుతున్నాం. మౌలిక సదుపాయాలపై మాత్రమే పెట్టుబడి పెట్టడం లేదు, తెలంగాణకు విద్యాపరమైన సహకారాలు కూడా అందిస్తాం. అత్యాధునిక పరిశోధనలను ఒకచోట చేర్చే పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా పది మందికి ఉపయోగపడాలన్నదే తమ లక్ష్యం. తెలంగాణ అభివృద్ధిని వేగవంతం చేయడం, సాంకేతిక పరంగా సులభతరం చేయడం తమ కర్తవ్యం గా భావిస్తున్నాం ” అని అజిలిషియమ్సీఈఓ రాజ్ బాబు అన్నారు.






