- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఘోరీ మళ్లీ హల్ చల్ .. త్వరలో హైదరాబాద్ వస్తానంటూ వీడియో విడుదల
కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో హల్ చేసిన అఘోరీ మరోసారి తెరపైకి వచ్చారు. ఓ కేసులో జైలుకు వెళ్లిన అఘోరీ.. హైదరాబాద్‌లో జరుగుతున్న గో హత్యలపై పోరాటం చేస్తానంటూ వీడియో విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్: కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) హల్ చేసిన అఘోరీ(Aghori) మరోసారి తెరపైకి వచ్చారు. ఓ కేసులో జైలుకు వెళ్లిన అఘోరీ.. హైదరాబాద్‌లో జరుగుతున్న గో హత్యలపై పోరాటం చేస్తానంటూ వీడియో విడుదల చేసింది. తెలంగాణలో తాను పర్యటన చేసిన నేపథ్యంలో తన దృష్టికి చాలా సమస్యలు వచ్చాయని, తాజాగా పోరాటం చేస్తానంటూ చెప్పింది. గోవులను రక్షించే విషయంలో తాను సహాయం చేస్తానంటూ తెలిపింది. తెలంగాణలో చాలా చోట్ల గోహత్యలు జరుగుతున్నాయని ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించింది. తెలంగాణలోని ఆలయాలను తాను కాపాడానని చెప్పారు. త్వరలోనే తాను హైదరాబాద్ వస్తున్నానని, అందరూ సిద్ధంగా ఉండాలని అఘోరీ పిలుపునిచ్చారు.
కాగా ఒంటిపై బట్టలేకుండా అఘోరీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటన చేశారు. దేవాలయాల్లో ప్రవేశాల విషయంలో చాలా సార్లు వివాదానికి ప్రయత్నం చేశారు. అడ్డుకోబోయిన పోలీసులుపైనా పలుమార్లు అసభ్య కామెంట్లు చేశారు. రెండు వర్గాల మధ్య చిచ్చు రేపేలా వ్యాఖ్యలు సైతం చేశారు. అయితే బాధితుల ఫిర్యాదుతో అఘోరీ జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చారు. కోర్టు ఆదేశాలతో ప్రతి గురువారం కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో సంతకం చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అఘోరీ ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్‌లో అఘోరీ ఉన్నారు. తాజాగా హైదరాబాద్ వస్తున్నాంటూ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతున్న నేపథ్యంలో అఘోరీ వల్ల ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. గోహత్యల పేరుతో రెచ్చగొట్టే అవకాశాలున్నాయనే కోణంలో ఆలోచిస్తున్నారు. మరి హైదరాబాద్ వస్తున్న అఘోరీ విషయంలో పోలీసుల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.






