- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP to Telangana: నల్లగొండలో ప్రత్యక్షమైన అఘోరీ
రెండు తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ(Aghori) మాత వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దర్శనానికి వెళ్లిన ప్రతి ఆలయంలో ఆమె హంగామా చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ(Aghori) మాత వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దర్శనానికి వెళ్లిన ప్రతి ఆలయంలో ఆమె హంగామా చేశారు. వీటిని అక్కడే ఉన్న భక్తులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అవి కాస్త వైరల్‌గా మారాయి. ఇటీవల శ్రీశైలం(Srisailam)లో ఆమె చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఏకంగా ఆత్మహత్య చేసుకుంటానని రచ్చ రచ్చ చేశారు. అనంతరం పల్నాడులో హల్‌చల్ చేశారు. ఆ వెంటనే అచ్చంపేట(Atchampeta)కు వెళ్లి అక్కడున్న అమరేశ్వరాలయం దగ్గర హడావుడి చేశారు.
దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడకు చేరుకొని అఘోరీని అక్కడి నుంచి పంపించేశారు. తాజాగా.. ఈ అఘోరీ మాత నల్లగొండ ప్రత్యక్షమయ్యారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెరువుగట్టు శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.






