పూర్తిగా మారిపోయిన లేడీ అఘోరీ.. ఇప్పుడు ఎక్కడ ఉందంటే?

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-05 08:14:48  IST  )

తాజాగా గురువారం అఘోరీ తమ స్వగ్రామం నెన్నెల సమీపంలోని బెల్లంపల్లిలో దర్శనం ఇచ్చింది. హౌస్ అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులను ఇబ్బంది పెట్ట‌గా కేసులు న‌మోదు చేశారు. ఆ కేసులో బెయిల్ కోసం బెల్లంప‌ల్లి కోర్టు వద్ద న్యాయ‌వాదిని క‌లిసి మాట్లాడింది.

పూర్తిగా మారిపోయిన లేడీ అఘోరీ.. ఇప్పుడు ఎక్కడ ఉందంటే?
X

దిశ‌, వెబ్ డెస్క్: లేడీ అఘోరీ మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్.. మీడియాలో రొటీన్ టాపిక్. కాశీలో అఘోరాలు ఉంటారని తెలుసు అఘోరీలు ఉంటారని ఎవ్వరికీ తెలియదు. కానీ గతేడాది సికింద్రాబాద్ వద్ద ఓ ఆలయంపై దాడి జరగడంతో అక్కడ లేడీ అఘోరీ దర్శనం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపర్చింది. తాను లేడీ అఘోరీ అని వారణాసి నుండి సనాతన ధర్మం కాపాడేందుకు వచ్చానని చెప్పుకుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉండగా అఘెరీ కారు, ఐఫోన్ చూసి అంతా అవాక్కైపోయారు. అఘోరాలు అంటే ఎక్కడో మనుషులకు కనిపించకుండా దైవ చింతనలో ఉంటారు కానీ ఇలా రోడ్లపై తిరగరు అని అంతా మండిపడ్డారు.

మరోవైపు అఘోరీ టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఎక్కడికి వెళ్లినా ఏదో ఒకటి చేసి వార్తల్లో నిలవడంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతటా అఘోరీ గురించి మాట్లాడుకున్నారు. వరుస వివాదాల్లో చిక్కుకుంటూ పబ్లిక్ ప్రదేశాల్లో న్యూసెన్స్ క్రియేట్ చేయడం, దాడులు చేయడంతో అఘోరీపై అందరికీ విరక్తి పుట్టింది. మరోవైపు లవ్ ట్రాక్ అంటూ ఓ యువతితో కలిసి వీడియోలు చేయడం, ఆ తరవాత అఘోరీ నా భర్త, నన్ను మోసం చేశాడు అంటూ ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో చివరికి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కట్ చేస్తే అఘోరీ ఆడ కాదు మగ కాదు అని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు.

ఇక జైలు జీవితం గడిపిన అఘోరీ ఇటీవలే విడుదల అవ్వగా మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటుంది. జైలు నుండి బయటకు వచ్చిన తరవాత కాశీకి వెళ్లిపోతున్నానని చెప్పింది. ఆ తరవాత మళ్లీ కనిపించలేదు. కాగా తాజాగా గురువారం అఘోరీ తమ స్వగ్రామం నెన్నెల సమీపంలోని బెల్లంపల్లిలో దర్శనం ఇచ్చింది. హౌస్ అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులను ఇబ్బంది పెట్ట‌గా కేసులు న‌మోదు చేశారు. ఆ కేసులో బెయిల్ కోసం బెల్లంప‌ల్లి కోర్టు వద్ద న్యాయ‌వాదిని క‌లిసి మాట్లాడింది. అయితే గ‌తంలో మాదిరిగా కాకుండా ఎలాంటి హ‌డావిడీ చేయ‌కుండా అక్క‌డ నుండి వెళ్లిపోయింది. దుస్తులు కూడా గ‌తంలో మాదిరిగా కాకుండా పూర్తిగా క‌ప్పుకుని ద‌ర్శ‌నం ఇచ్చింది. దీంతో ప్ర‌స్తుతం అఘెరీ త‌మ స్వ‌గ్రామంలోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా జైలు జీవితం, కేసుల ఎఫెక్ట్‌తో పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తోంది.

Next Story