ప్రతిరోజు బీర్లు, బిర్యానీ.. వాడి అసలు రూపం అదే.. లేడీ అఘోరీ బండారం బయటపెట్టిన వర్షిణి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-27 07:06:05  IST  )

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారిన అఘోరీ శ్రీనివాస్ జైలు నుండి విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే జైలుకు వెళ్లే ముందు శ్రీనివాస్ వ‌ర్షిణి అనే యువ‌తిని వివాహం చేసుకున్నాడు. వీరిద్ద‌రూ ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆ త‌ర‌వాత శ్రీనివాస్ మొద‌టి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి జైలుకు పంపించారు.

ప్రతిరోజు బీర్లు, బిర్యానీ.. వాడి అసలు రూపం అదే.. లేడీ అఘోరీ బండారం బయటపెట్టిన వర్షిణి
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారిన అఘోరీ శ్రీనివాస్ జైలు నుండి విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే జైలుకు వెళ్లే ముందు శ్రీనివాస్ వ‌ర్షిణి అనే యువ‌తిని వివాహం చేసుకున్నాడు. వీరిద్ద‌రూ ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆ త‌ర‌వాత శ్రీనివాస్ మొద‌టి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి జైలుకు పంపించారు. శ్రీనివాస్ జైలుకు వెళ్లిన త‌ర‌వాత వ‌ర్షిణికి పోలీసులు ఓ ట్ర‌స్ట్ కు సంబంధిచిన ఆశ్ర‌మంలో ఆశ్ర‌యం క‌ల్పించారు. కాగా అఘోరీ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత మొద‌టిసారి మీడియా ముందుకు వ‌చ్చిన వ‌ర్షిణి అత‌డిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. త‌మ గ్రామానికి వ‌చ్చిన‌ప్పుడు అఘోరీ శ్రీనివాస్ తో ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని చెప్పింది.

అత‌డి కార్ రిపేర్ అవ్వ‌డంతో ఇంట్లో ఆశ్ర‌యం క‌ల్పించామన్నారు. త‌న‌కు మాయ‌మాట‌లు చెప్పాడ‌ని మంత్రాలు వ‌స్తాయ‌ని, కుటుంబం లేద‌ని ఎన్నో అబ‌ద్దాలు చెప్పాడ‌ని తెలిపింది. దైవ‌త్వం అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని అతడు దైవ‌త్వం గురించి చెప్ప‌డం వ‌ల్ల‌నే అత‌డి మాయ‌లో ప‌డ్డాన‌ని తెలిపింది. త‌మ ఇంట్లో ఉన్న‌ప్పుడు ప్ర‌తిరోజు చికెన్ తిన‌డం, బీర్లు తాగ‌డం లాంటివి చేసేవాడ‌ని చెప్పింది. అత‌డితో ఇంట్లో నుండి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన త‌ర‌వాత బెదిరింపుల‌కు పాల్ప‌డి వివాహం చేసుకున్నాడ‌ని ఆరోపించింది.

న‌న్ను వ‌దిలివెళ్లిపోతే నువ్వు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల్సిందే అని బెదిరించాడ‌ని అందుకే పెళ్లి చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని చెప్పింది. అఘోరీ గురించి నిజాలు తెలిసిన త‌ర‌వాత‌నే అత‌డితో విడిపోయాన‌ని వెల్ల‌డించింది. అత‌డికి మూడు పెళ్లిళ్లు అయ్యాయ‌ని, అత‌డి ప్రైవేట్ పార్ట్ డ్యామేజ్ అవ్వ‌డం వ‌ల్ల‌నే ఈ రూపంతో వ‌చ్చిన‌ట్టు తెలిసింద‌ని చెప్పింది. అత‌డి వ‌య‌సు 38ఏళ్లు అయితే 27ఏళ్లు అని చెప్పి మోసం చేశాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. తాను ఫోన్ చేస్తే చిటికెలో డ‌బ్బులు అకౌంట్ లో ప‌డ‌తాయ‌ని చెప్పేవాడ‌ని తెలిపింది. తాను ప‌క్క‌న ఉన్న‌ప్పుడు కూడా కార్ డ్రైవింగ్ చేయ‌డం సిగ‌రెట్ తాగ‌టం త‌ప్ప ఎలాంటి అఘోరీ సాధన చేసేవాడు కాద‌ని ఆరోపించింది. అఘోరీ త‌నను ఎంతో మోసం చేశాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇక‌పై మీడియాలో త‌న గురించి మాట్లాడితే చీల్చి చెండాడుతాను అంటూ హెచ్చ‌రించింది.

Next Story