- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aghori: మళ్లీ అఘోరీ మాత హల్‌చల్.. యువకులు వెంబడించడంతో!?
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత సంవత్సరంలో ఓ అఘోరీ(Aghori) మాత హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత సంవత్సరంలో ఓ అఘోరీ(Aghori) మాత హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ(Andhra Pradesh), తెలంగాణ(Telangana)లోని పలు ఆలయాలను సందర్శించిన అఘోరీ పలుచోట్ల దురుసుగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలిచారు. ఇలా కొన్ని రోజులు లేడీ అఘోరీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించారు. ఈ క్రమంలో ఏపీలోని పలు ఆలయాలను సందర్శించిన అఘోరీ మాత పోలీసులు అడ్డుకుంటున్నారంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ తరుణంలో అఘోరీ ప్రవర్తనపై స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక తర్వాత కొద్దిరోజుల నుంచి ఎవరికీ కనిపించకుండా పోయిన అఘోరీ మాత మళ్లీ ప్రత్యక్షం అయ్యింది. తాజాగా అఘోరీ మాత కరీంనగర్(Karimnagar)లో ప్రత్యక్షమయ్యారు. రెండ్రోజులుగా కరీంనగర్ బైపాస్ రోడ్డు పక్కన అఘోరీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు(ఆదివారం) ఉదయం పెద్దపల్లి వైపు వెళ్తుండగా.. కొందరు ఆకతాయిలు ఆమె వెంట పడ్డారు. దీంతో కారు ఆపేసిన లేడీ అఘోరీ వారితో వాగ్వాదానికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. తన కారును కొంతమంది యువకులు ఢీకొట్టారని, తనతో వాగ్వాదానికి దిగారని పోలీసులకు అఘోరీ మాత వివరించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెకు సర్దిచెప్పి తిరిగి పెద్దపల్లి(Peddapalli) వైపునకు పంపించారు.






