Chakradhar Goud: నిన్న రాజలింగమూర్తి.. నెక్స్ట్ టార్గెట్ నేనే.. బీఆర్ఎస్ పై చక్రధర్ గౌడ్ సంచలన ఆరోపణలు

by Prasad Jukanti |

బీఆర్ఎస్ పై చక్రధర్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు.

Chakradhar Goud: నిన్న రాజలింగమూర్తి.. నెక్స్ట్ టార్గెట్ నేనే.. బీఆర్ఎస్ పై చక్రధర్ గౌడ్ సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సామాజిక కార్యకర్త, మాజీ కౌన్సిలర్ భర్త నాగవెల్లి రాజలింగమూర్తి (Rajalingamurthy) హత్య తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నది. మేడిగడ్డ కుంగుబాటులో కేసీఆర్ (KCR), హరీశ్ రావు, తదితరులపై న్యాయపోరాటం చేస్తున్న రాజలింగమూర్తి కిరాతకంగా హత్యకు గురికావడం వెనుక రాజకీయంగా అనేక ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హత్య (Murder) వెనుక బీఆర్ఎస్ కుట్ర కోణం ఉందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంటే ఈ హత్యతో మాకు సంబంధం లేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావుపై న్యాయపోరాటం చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ (Chakradhar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ అక్రమాలపై పోరాటం చేస్తున్న వారిని ఒక్కొక్కరిని లేపేస్తున్నారని నిన్న రాజలింగమూర్తిని చంపేశారు.. బీఆర్ఎస్ నెక్స్ట్ టార్గెట్ నేనే అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దిశ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజలింగమూర్తి హత్యతో పాటు తన విషయంలో జరుగుతున్న పలు కీలక అంశాలపై ఆయన స్పందించారు.

అంతుచూస్తామంటూ బెదిరింపులు:

గత ప్రభుత్వానికి అడ్డు తగిలిన వ్యక్తులను ఒక్కొక్కరిగా చంపేసుకుంటూ వస్తున్నారు. వాళ్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని చక్రధర్ గౌడ్ అన్నారు. తనకూ ప్రాణహాని ఉందని నా అంతుచూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజం కోసం కొట్లాడుతున్న గొంతుకలను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. హరీశ్ రావు (Harish Rao) దుర్మార్గాలపై ఎప్పుడైతే కోర్టుకు వెళ్లానో ఆ రోజే నా ప్రాణాలు సమాజం కోసం అంకితం అనుకునే బయలుదేరానన్నారు. చావు ఏదో ఒకరోజు తప్పదు. కానీ సమాజం కోసం పోరాడి చావడానికి సిద్ధమే అన్నారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) ద్వారా వ్యక్తి స్వేచ్ఛను హరించారని కోర్టు మెట్లెక్కిన మొట్టమొదటి వ్యక్తిని నేను. కేసు వెనక్కి తీసుకోమని చాలా శక్తులు నన్ను వెంటాడుతున్నాయి. తనకు ఏం జరుగుతుందో అనే ఆందోళన నా కుటుంబ సభ్యుల్లో వ్యక్తం అవుతున్నదని చెప్పారు. తనకు ప్రాణహాని ఉందనే విషయంలో 8 నెలల క్రితమే డీజీపీని కలిసి చెప్పానని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) కలుస్తానన్నారు.

రాజకీయ హత్యలో భాగంగానే రాజలింగమూర్తిని చంపేశారని చక్రధర్ గౌడ్ ఆరోపించారు. పోరాడే గొంతుకను చంపేశారంటే ప్రజాస్వామ్యాన్ని చంపడమే అని అన్నారు. బీఆర్ఎస్ (BRS) అధికారంలో లేకపోతేనే ఈ పరిస్థితి ఉంది. ఒక వేళ ఆ పార్టీ అధికారంలో ఉండి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. వారు అధికారంలో ఉండగా భూములు గుంజుకున్నారు. అడ్డువచ్చిన వారిపై పీడీ యాక్టులు పెట్టారు. కుటుంబాలను బజారుకీడ్చారు. వీటిపై పోరాటం చేస్తుంటే సమాధానాలు చెప్పకుండా హత్య రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

Next Story