కాసేపట్లో పెళ్లి.. అంతలోనే విషాదం

by Disha Web Desk 4 |
కాసేపట్లో పెళ్లి.. అంతలోనే విషాదం
X

దిశ, కోరుట్ల: కాసేపట్లో వివాహం.. పచ్చని పందిళ్లు.. మేళతాళాలతో పండుగలా ఆ ఇల్లు కళకళలాడుతోంది.. కాసేపట్లో తన కుమారుడు పెళ్లి కొడుకై కళ్యాణ వేదికకు వెళ్లాల్సిన సమయం.. చిన్నాపెద్దా .. పిల్లాపాప అంతా సందడిగా సంతోషంగా గడుపుతున్న వేళ ఆ ఇంట్లో పెనువిషాదం చోటుచేసుకుంది. కోరుట్ల పట్టణంలో గురువారం చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా విషాదం నింపింది.

వివరాలలోకి వెళితే.. పట్టణంలోని ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన కూసరి గంగారాం - రాజేశ్వరిల కుమారునికి మల్లాపూర్ మండలం కొత్తదాంరాజ్ పల్లి గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయం అయింది. శుక్రవారం పెళ్లికి అంతా సిద్ధమవుతున్న వేళ అదే రోజు ఉదయం పెళ్లికుమారుడి తండ్రి గంగారాం (55) ఆకస్మికంగా గుండె పోటుతో మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.



Next Story

Most Viewed