స్పైనల్ సర్జరీల్లో అధునాతన వైద్యం.. యూబీఈ

by Naga Rani Yarlagadda |

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో న్యూరో-స్పైనల్ సర్జరీ రంగంలో తాజా సాంకేతికతలకు మార్గనిర్దేశం చేసేలా యూనిలేటరల్..

స్పైనల్ సర్జరీల్లో అధునాతన వైద్యం.. యూబీఈ
X
  • నిమ్స్ వైద్యులు అంతర్జాతీయ స్థాయిలో తమ నైపుణ్యాలను పెంచుకున్నారు
  • న్యూరో-స్పైనల్ సర్జరీపై వర్క్ షాప్ లో నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప

దిశ, తెలంగాణ బ్యూరో: నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో న్యూరో-స్పైనల్ సర్జరీ రంగంలో తాజా సాంకేతికతలకు మార్గనిర్దేశం చేసేలా యూనిలేటరల్ బైపోర్షల్ స్పైనల్ ఎండోస్కొపీ(యూబీఈ) కోర్స్- కడావరిక్ వర్క్ షాప్ అండ్ సర్జికల్ ప్రెసెప్టోర్షిప్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. శనివారం నిమ్స్ లోని ఎమర్జెన్సీ బిల్డింగ్‌ ట్రామా ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ వర్క్‌షాప్ ద్వారా న్యూరో-స్పైనల్ సర్జరీలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మినిమల్లి ఇన్వేసివ్ టెక్నిక్ అయిన యూబీఈ విధానాన్ని నిమ్స్ వైద్యులకు పరిచయం చేసినట్లు తెలిపారు. రెండు చిన్న రంధ్రాల ద్వారా చేసే ఈ (న్యూరో-స్పైనల్ సర్జరీ) శస్త్రచికిత్స పద్ధతి వల్ల రోగికి తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఇది భవిష్యత్ స్పైనల్ సర్జరీకి కీలక మార్గదర్శకంగా ఉంటుందన్నారు. కడావర్ వర్క్ షాప్ ద్వారా వైద్యులు... పరిశోధనల కోసం హాస్పిటల్స్ కు డొనేట్ చేసిన మృతదేహాలపై నేరుగా శిక్షణ పొందడం, స్పైన్ అనాటమీ, నరాల నిర్మాణం, ఆపరేటివ్ యాక్సెస్ వంటి అంశాల్లో లోతైన అవగాహనను కలిగిస్తుందన్నారు. ఇదే నిజమైన ప్రాక్టర్-బేస్డ్ లెర్నింగ్ అని వెల్లడించారు. సర్జికల్ ప్రెసెప్టోర్షిప్ సెషన్‌లో అనుభవజ్ఞులైన సర్జన్లు లైవ్ సర్జరీ డెమోస్ చూపించడం ద్వారా నిమ్స్ వైద్యులు ఆధునిక శస్త్రచికిత్స సాంకేతికతలను ప్రత్యక్షంగా నేర్చుకునేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిమ్స్ వైద్యుల నైపుణ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తాయఅని డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం వైద్యుల నైపుణ్యాలను పెంచి, రోగులకు మరింత సమర్థవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి దోహదపడుతుందని ఆయన పేర్కన్నారు. ఈ కార్యక్రమంలో డా. సుచంద భట్టాచార్య, డా. వంశీ కృష్ణ యెర్రమేని, డా. డి. రాజా రెడ్డి తదితర న్యూరో సర్జన్లు పాల్గొన్నారు.

Next Story