- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వర్షాకాలం ఇసుక కోసం ముందస్తు బల్క్ బుకింగ్‌లు ప్రారంభం
వినియోగదారులకు చౌక ధరలకు నాణ్యమైన ఇసుక లభించేలా రాబోయే వర్షాకాలం జూన్ నుంచి అక్టోబర్ వరకు ముందస్తు బల్క్ ఇసుక బుకింగ్‌లను ప్రారంభించినట్లు తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) ప్రకటించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : వినియోగదారులకు చౌక ధరలకు నాణ్యమైన ఇసుక లభించేలా రాబోయే వర్షాకాలం జూన్ నుంచి అక్టోబర్ వరకు ముందస్తు బల్క్ ఇసుక బుకింగ్‌లను ప్రారంభించినట్లు తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) ప్రకటించింది. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ బల్క్బుకింగ్కోసం దరఖాస్తులు ఈనెల 8వ తేదీ నుంచి 18 వరకు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. దరఖాస్తుదారులు 32 మెట్రిక్ టన్నుల నుండి 5 వేల మెట్రిక్ టన్నుల వరకు సామర్ధ్యం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతేడాదిలో మెట్రిక్టన్ను రూ. 1600 ఉండగా, ఈఏడాది నుంచి రూ. 1400 లకు తగ్గించింది. దరఖాస్తుల ఆమోదం మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ప్రాతిపదికన ఉంటుంది. ఆమోదించబడిన దరఖాస్తులు చెల్లింపు పూర్తి చేయడానికి ఆమోదం పొందిన తేదీ నుండి 10 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటాయి.
సరఫరా వ్యవధి జూన్ 2026 నుండి అక్టోబర్ 2026 వరకు ఆమోదించబడిన ఇసుక బజార్లు అదనపు స్టాక్‌యార్డుల నుండి సరఫరా చేయబడుతుంది. జూన్ నుండి సంబంధిత బల్క్ లాగిన్‌ల ద్వారా చెల్లించిన పరిమాణానికి అనుగుణంగా రవాణా కోసం వాహనాలను సిద్దం చేసుకోవాలి. వర్షాకాలంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్మాణ కార్యకలాపాల అవసరాలను తీర్చడానికి నిరంతరాయంగా ఇసుక సరఫరా టీజీఎండీసీ చేయనుంది. హెచ్ఎండీ ఏ పరిధిలోని ఇసుక బజార్ల నుండి ముతక ఇసుక నిరంతర సరఫరా కోసం ముందస్తు బుకింగ్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. భౌరంపేట, వట్టినాగులపల్లి, ఆదిభట్ల, అబ్దులాపూర్మెట్ఇసుక బజార్ల నుండి జూన్ నుండి అక్టోబర్ వరకు రవాణా చేయబడుతుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు ఇసుక బజార్లతో పాటు, వర్షాకాలంలో నిరంతరాయంగా తగినంత ఇసుక సరఫరాను గుర్తించడానికి , ప్రస్తుతం ఉన్న వాటి మాదిరిగానే హైదరాబాద్ సమీపంలో అదనపు స్టాక్‌యార్డులను ఏర్పాటు చేస్తుంది.






