Adulterated Milk: రాష్ట్రంలో కల్తీ పాల కలకలం.. యూరియా, రసాయనాలు కలిపి అమ్మేస్తున్న కేటుగాళ్లు

by Kema Shiva Kumar |   (  Updated:2024-12-07 08:21:33  IST  )

‘కాదేది కల్తీకి అనర్హం’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు కేటుగాళ్లు.

Adulterated Milk: రాష్ట్రంలో కల్తీ పాల కలకలం.. యూరియా, రసాయనాలు కలిపి అమ్మేస్తున్న కేటుగాళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కాదేది కల్తీకి అనర్హం’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. తినే తిండి.. తాగే నీరు కల్తీ చేస్తున్నట్లుగానే మనం రోజూ తాగే పాలు కూడా కల్తీ అవుతున్నాయి. తాజాగా, ఓ వ్యక్తి కల్తీ పాలు అమ్ముతూ ప్రజలకు జీవితాలతో ఆటలాడుతున్నాడు. జగిత్యాల జిల్లా (Jagityal) భీమారం (Beemaram Mandal) మండల పరిధిలోని వెంకటరావు‌పేట (Venkatraopet) గ్రామానికి చెందిన పాల వ్యాపారి మల్లయ్య కల్తీ పాలు అమ్ముతూ.. జనాన్ని నిలువునా మోసం చేస్తున్నాడు. అయితే, మూడు రోజు క్రితం మల్లయ్య దగ్గర పాలు కొనుగోలు చేసి తాగిన లావణ్య కుటుంబం తీవ్ర అస్వస్థతకు గురైంది. రోజులు గడిచినా.. పాలు విరగకపోవడంతో అనుమానం వచ్చి చెక్ చేయగా అందులో యూరియా, సోడ, ఇతర రసయనాలు కలిపినట్లుగా వెల్లడైంది. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు పాల వ్యాపారి మల్లయ్యపై అధికారులకు ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story