సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అడోబ్ సీఈవో శంతను నారాయణ్

by Prasad Jukanti |

రేవంత్ రెడ్డిని అడోబ్ సీఈవో శంతను నారాయణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలపై ఇరువురు చర్చించారు.

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అడోబ్ సీఈవో శంతను నారాయణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణను మాన్యుఫ్యాక్చరింగ్ పవర్‍గా తీర్చిదిద్దాలని, ఇందుకు కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిచాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అభిప్రాయపడ్డారు. ఇవాళ అడోబ్ సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డ్ సభ్యులు శంతను నారాయణ్ (Shantanu Narayen) మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా సీఎంతో శంతను నారాయణ్ చర్చించారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై AI ప్రభావం, స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్‍కు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎకానమీపై ఏఐ రెవల్యూషన్ ప్రభావం, రాబోయే రోజుల్లో AI ని సమర్ధవంతంగా వినియోగించుకునే అంశాలపై శంతను నారాయణ్‍తో సీఎం చర్చించారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకరించాలని సీఎం కోరారు.

Next Story