గురుకుల కళాశాలల్లో అడ్మిషన్ల జోరు.. సవాలుగా మారిన మౌలిక సదుపాయాలు

by Naga Rani Yarlagadda |

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలను తగ్గించడం లేదని ఆ సొసైటీ చెబుతోంది. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా గురుకులాల్లో వస్తున్న ఫలితాలతో గురుకులాల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు.

గురుకుల కళాశాలల్లో అడ్మిషన్ల జోరు.. సవాలుగా మారిన మౌలిక సదుపాయాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలను తగ్గించడం లేదని ఆ సొసైటీ చెబుతోంది. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా గురుకులాల్లో వస్తున్న ఫలితాలతో గురుకులాల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో 12 గురుకుల కాలేజీలు ఎత్తివేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని అధికార యంత్రాంగం పేర్కొన్నది. ఎస్సీ గురుకుల పరిధిలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, సాధారణ ఇంటర్‌, ఒకేషనల్‌ జూనియర్‌ కాలేజీలు కలిపి 239 గురుకులాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఎంపీసీ, బైపీసీతోపాటు ఇతర కోర్సులకు ఆడ్మిషన్స్ కొనసాగుతున్నాయి. గౌలిదొడ్డిని సీఓఈ కాలేజీ తరహాలో మరిన్ని సీఓఈ కాలేజీలు పెంచేందుకు సొసైటీ కృషి చేస్తోంది. తెలంగాణ ఇంటర్​బోర్డు గైడ్‌లైన్స్​ప్రకారమే.. అన్ని గురుకులాల జూనియర్ కాలేజీల్లో ఏర్పాట్లు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొంటున్నారు. సైన్స్​కోర్సుల నిమిత్తం ల్యాబ్‌లు, అందుకు అవసరమైన గదులు, ఇతర సౌకర్యాలు ఉండేలా చూస్తున్నామని తెలిపారు.

ప్రైవేటు భవనాల్లో..

ఎస్సీ గురుకులాల కాలేజీలు చాలా వరకు ప్రైవేటు బిల్డింగ్ భవనాల్లో కొనసాగుతున్నాయి. అక్కడ విద్యార్థులకు కావాల్సిన మౌలికల సదుపాయాల కొరత విపరీతంగా ఉంది. ముఖ్యంగా ల్యాబ్ సౌకర్యంతో పాటు గ్రౌండ్, వాష్‌రూమ్స్ ఇలా ఎన్నో రకాల సౌకర్యాలు లేని కారణంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న జూనియర్ కళాశాలను పక్కనే ఉన్న కళాశాలకు సర్దుబాటు చేస్తున్నామని అధికార యంత్రాంగం పేర్కొంది. అయితే, కళాశాలను ఏమాత్రం తగ్గించడం లేదంటున్నారు. అలాగే ఇంటర్‌లో ఉన్న సీట్ల భర్తీ సంఖ్యను ఇప్పటి వరకు తగ్గించలేదంటున్నారు. ఇంటర్‌లో చాలామంది విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ కోర్సుల్లోనే విద్యార్థులు అధిక సంఖ్యలో జాయిన్ అవుతున్నారు. విద్యార్థులు కోరుకున్న మేరకు కోర్సులను మరిన్ని పెంచడం జరిగిందే తప్ప కళాశాలను తగ్గించడం అనేది జరగలేదని ఎస్సీ గురుకులాల కార్యదర్శి డాక్టర్​అలగు వర్షిణి చెబుతున్నారు.

గురుకుల ఇంటర్​ కాలేజీలు సౌకర్యాల కోసం సర్దుబాటు చేస్తున్నవి ఇవే..

Next Story