- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందుబాటులో అన్ని రకాల కోర్సులు
అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజీల్లో అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయని మాజీ మంత్రి, అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాస రావు తెలిపారు.

- మార్కెట్లు అవసరాలకు అనుగుణంగా స్కిల్ పెంపొందించేలా శిక్షణ
- డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ సీట్లలో అడ్మిషన్లు
- అవంతి విద్యా సంస్థల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు
దిశ, తెలంగాణ బ్యూరో: అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజీల్లో అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయని మాజీ మంత్రి, అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాస రావు తెలిపారు. డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సులలో అడ్మిషన్లు ప్రారంభమయ్యామని తెలిపారు. బీటెక్ లోని అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఇంజనీరింగ్ కాలేజీలకు అటానమస్ గుర్తింపు లభించిందని చెప్పారు. ఎంటెక్ లో అన్ని కోర్సులు, ఎంబీఏలో ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఎంసీఏ, ఐటీ, భీఫార్మసీ, ఎంఫార్మసీ బీబీఏ, బీసీఏ కోర్సులు, డిగ్రీ బీకామ్ లో కంప్యూటర్ అప్లికేషన్స్, కామర్స్, జనరల్, బిజినెస్స్, ఎనలటిక్స్, ఈఅండ్ఎం కామర్స్, డిజిటల్ మార్కెటింగ్, బీఎస్సీ ఆనర్స్, ఏఐ అండ్ ఎంఎల్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ కోర్సులు కాలేజీలో అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకోవచ్చని కోరారు. దేశవ్యాప్తంగా ఈ విద్యాసంస్థలకు మంచి గుర్తింపు ఉండడంతో వివిధ రాష్ట్రాల వేలాది మంది విద్యార్థులు, ముఖ్యంగా నార్త్ ఇండియా నుండి పెద్ద ఎత్తున అవంతి విద్యా సంస్థల్లో చేరుతుండడం విశేషం. విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్, నిష్ణాతులైన బోధనా సిబ్బందితో విద్యార్థులకు తరగతులు చెప్పించడంతో పాటు, విద్యా సంస్థలపై నిరంతరం చైర్మన్ పర్యవేక్షణ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అవంతి ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివి మంచి ప్లేస్మెంట్లు పొంది, భారీ వేతనంతో విదేశాలలో స్థిరపడిన వారు చాలామంది విద్యార్థులు ఉండడం విశేషం.
వంద శాతం ప్లేస్ మెంట్స్
విద్యార్థులకు వంద శాతం ప్లేస్మెంట్లు కల్పిస్తున్నామని అవంతి విద్యా సంస్థల చైర్మన్ తెలిపారు. విద్యార్థులకు మార్కెట్ అవసరాలకు తగినట్లు నైపుణ్యాలు పెంపొదిస్తామని, దానికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు సైతం నిర్వహిస్తామని పేర్కొన్నారు. సైన్స్ లో 159 వ ర్యాంకు, బీబీఏలో 162 వ ర్యాంకు, కామర్స్ లో 176 వ ర్యాంకు సాధించారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, విద్యార్థులు 7799765786, 9849408078 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని శ్రీనివాస్ రావు కోరారు.






