TG: సత్ఫలితాలిస్తోన్న CM రేవంత్ ప్లాన్.. ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు!

by Gantepaka Srikanth |

ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది ఎన్ రోల్ మెంట్స్ పెరిగాయి. ప్రభుత్వం, అధికారులు, టీచర్లు ఫోకస్ పెట్టడంతో ఈసారి భారీగా అడ్మిషన్లు వచ్చాయి.

TG: సత్ఫలితాలిస్తోన్న CM రేవంత్ ప్లాన్.. ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది ఎన్ రోల్ మెంట్స్ పెరిగాయి. ప్రభుత్వం, అధికారులు, టీచర్లు ఫోకస్ పెట్టడంతో ఈసారి భారీగా అడ్మిషన్లు వచ్చాయి. గతేడాది కంటే 50 వేల మంది అధికంగా విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. సగటున ప్రతి ఏటా 2 లక్షల మంది కొత్త విద్యార్థులు చేరుతుంటారు. కానీ సీఎం ఆదేశాల మేరకు విద్యా శాఖ సెక్రెటరీ యోగితా రాణా ఫోకస్ పెట్టడంతో ఈ ఏడాది సత్ఫలితాలు వచ్చాయి. వచ్చే ఏడాది నుంచి మరింత స్థాయిలో అడ్మిషన్లు పెంచేందుకు దృష్టి సారించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన రివ్యూలో ఆదేశించినట్లు తెలుస్తున్నది.

ప్రయివేటుకు దీటుగా ప్రచారం, సౌకర్యాలు ఈ అకడమిక్ ఇయర్ ప్రారంభానికి పక్షం రోజుల ముందు నుంచే ఎన్‌రోల్‌మెంట్‌పై విద్యాశాఖ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ కరపత్రాలతో ప్రచారం, ఆటోలకు మైక్‌లు బిగించి ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేశారు. రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లే కంటే ముందే టీచర్లు వారి ఇళ్లకు వెళ్లి స్కూల్ వయస్సుకు వచ్చిన పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. బడులు తెరిచిన రోజునే కొత్త డ్రెస్సులు, పుస్తకాలు అందిస్తామని వివరించారు. దీంతో ఈసారి ఆశించిన స్థాయిలో కొత్త అడ్మిషన్లు వచ్చాయనే చర్చ అధికార వర్గాల్లో ఉంది.

140 స్కూల్స్ రీ ఓపెన్

రాష్ట్ర వ్యాప్తంగా 26,287 ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ రన్నింగ్‌లో ఉన్నాయి. కొన్నేళ్లుగా సుమారు 1,000 స్కూళ్లలో జీరో అడ్మిషన్లు నమోదు కావడంతో అక్కడి పాఠశాలలకు తాళాలేశారు. అక్కడ పని చేస్తోన్న టీచర్లను సమీప బడులకు డిప్యూటేషన్‌పై పంపించారు. కానీ ఈసారి అధికారులు గ్రామ స్థాయి నేతల సహకారం తీసుకుని 140 స్కూళ్లను రీఓపెన్ చేయించారు. దీంతో అక్కడ ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు వచ్చాయి. ఆయా స్కూళ్లకు కావాల్సిన మౌలిక వసతులు, రిపేర్ల కోసం ఒక్కో బడికి రూ.2 లక్షలు కేటాయించారు. ఆ పనులను జిల్లా కలెక్టర్లే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది 118 మంది ప్రభుత్వ టీచర్లు తమ పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్‌లో చేర్పించారు. మిగతా టీచర్లు సైతం తమ పిల్లలను సర్కారు బడులకు పంపేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో డిస్కషన్ సాగుతోంది.

సీఎం స్పెషల్ ఫోకస్: యోగితారాణా, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ

విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. సూక్ష్మ స్థాయి సమస్యలను సైతం అడిగి తెలుసుకుంటున్నారు. వెంటనే పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. అందుకే ఈసారి గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్లో 50 వేల మంది విద్యా్ర్థులు అదనంగా అడ్మిషన్లు తీసుకున్నారు. స్కూల్స్ రిపేర్ల కోసం అవరసమైన నిధులు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు.

Next Story