- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు.. డిగ్రీ, పీజీ కోర్సులకు దరఖాస్తులు
హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని (Ambedkar Open University) అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. (Degree & PG Admissions) డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ) కోర్సులు, పీజీ (ఎంఏ/ ఎంకాం/ ఎంఎస్సీ) కోర్సులు, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశానికి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల అయినట్లు విశ్వవిద్యాలయ అధికారులు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సులు తదితర వివరాలను www.braouonline.in; www.braou.ac.in లో పొందొచ్చని అధికారులు వెల్లడించారు.
ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా ఆగస్టు 13వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలని సూచించారు. పూర్తి సమాచారం కొరకు, ఆన్ లైన్‌లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు: 7382929570/580, 040-23680290/291/294/295 టోల్‌ఫ్రీ నెం.18005990101 లో సంప్రదించొచ్చని సూచించారు.
డిగ్రీ, పీజీ ఓల్డ్ బ్యాచ్ విద్యార్థులు రెండో, మూడో సంవత్సరంలో ఫీజు సకాలంలో చెల్లించలేక పోయిన వారు, 2016-17 విద్యా సంవత్సరం నుంచి 2024-25 వరకు అడ్మిషన్ పొంది ఉంటే నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా TS/AP ఆన్ లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించొచ్చు అని వివరించారు. ఆగస్టు 13 ట్యూషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ అని వెల్లడించారు.






