- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Adluri Laxman: బాధ్యతలు స్వీకరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
by Prasad Jukanti |
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ (Minister Adluri Laxman) బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం సచివాలయంలో (Telangana Secretariat) తనకు కేటాయించిన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అడ్లూరికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తోపాటు సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అడ్లూరి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Next Story






