- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court: హైకోర్టులో కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో హైకోర్టు ప్రతివాదులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హెచ్ సీయూ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో (Kancha Gachibowli Land Issue) ఈ నెల 24 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను తెలంగాణ హైకోర్టు (High Court) ఆదేశించింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నందున ఈ నెల 24లోపు కౌంటర్, రిపోర్టు సమర్పించాలని ఆదేశించిది. ఈ భూముల వ్యవహారంపై వట ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్ పై గత విచారణ సందర్భంగా సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు భూముల వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం(Telangana Govt), టీజీఐఐసీని (TGIIC) హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈపిటిషన్ పై ఇవాళ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఫేక్ వీడియోలు, ఫారెస్ట్ తగలబెట్టిన వీడియోలపై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు ప్రసుత్తం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.






