- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై విచారణ వాయిదా
కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన పరిధి దాటి ఇచ్చిన ఈ నివేదిక చెల్లదని హైకోర్టులో హరీశ్ రావు తరఫు న్యాయవాది వాదించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో (Kaleshwaram Project) జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (PC Ghose) ఇచ్చిన నివేదికపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నివేదికను రద్దు చేయాలంటూ గతంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ ఎస్‍కే జోషి పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హరీశ్‌రావు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పరిధి దాటి వ్యవహరించిందని, కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం ప్రకారం పీసీ ఘోష్ నివేదిక చెల్లదన్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగిపోతే ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఏం జరిగిందో నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత మాత్రమే కమిషన్‌పై ఉంటుందని వాదించారు. కమిషన్ తన పరిధి దాటి నివేదిక ఇచ్చిందని అందువల్ల జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని వాదించారు. సుందరం వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. ఎల్లుండి కేసీఆర్ తరఫున న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపించనున్నారు.






