నేతలకు సవాల్‌గా మారిన జడ్పీ ఎన్నికలు

by Naga Rani Yarlagadda |

స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు టార్గెట్గా పావులు కదుపుతున్నాయి.

నేతలకు సవాల్‌గా మారిన జడ్పీ ఎన్నికలు
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు టార్గెట్గా పావులు కదుపుతున్నాయి. ఇప్పటి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయి పదవులకు అర్హత ఉన్న నేతల వెతుకులాట మొదలుపెట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ సహా, జాతీయస్థాయిలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి పార్టీలు జిల్లా పరిషత్ ఎన్నికలను అత్యంత కీలకంగా తీసుకుంటున్నాయి. మండల పరిషత్, ఎంపీటీసీ, సర్పంచ్.. ఎన్నికలు ఎలా ఉన్నా జిల్లా పరిషత్ స్థానాలను కైవసం చేసుకుంటే భవిష్యత్ ఎన్నికలకు సంకేతంగా ఉంటాయన్న ఆలోచనతో ఆయా రాజకీయ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి.

ఈ నేతలకు అగ్నిపరీక్ష..

జిల్లా పరిషత్ ఎన్నికలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన రాజకీయ పక్షాల నేతలకు అగ్నిపరీక్షగా మారుతున్నాయి తూర్పు జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీకి అధినేతగా ఉన్న మంత్రి వివేక్ ఎన్నికల్లో సత్తా చాటుతార అన్న ప్రశ్న మొదలైంది మంచిర్యాలజిల్లాలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తో తీవ్ర విభేదాలు ఉన్నాయి. మరోవైపు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఆ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాం నాయక్ నడుమ తీవ్ర విభేదాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి తూర్పు జిల్లాలో బలమైన కేడర్ లేదు. గులాబీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అసలు ఇటు రావడమే లేదు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే లక్ష్మి ఎన్నికలను అగ్నిపరీక్షగా ఎదుర్కోబోతున్నారు.

పశ్చిమ జిల్లాలో

ఉమ్మడి ఆదిలాబాద్ పశ్చిమ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి పెద్దది ఎక్కువగా ఉన్న నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి జెడ్పి ఎన్నికలు అత్యంత కీలకంగా మారుతున్నాయి. నిర్మల్ జిల్లాలో మరో శాసనసభ్యుడు రామారావు పటేల్ తో కలిసి జెడ్పిపీఠం కైవసం చేసుకుంటారా అన్నది ప్రశ్నగా ఉంది. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరి రావు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతున్నది ఖానాపూర్ శాసనసభ్యుడు బొజ్జు పటేల్ కు సైతం ఎన్నికలు కీలకంగా మారాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ మాజీ మంత్రి జోగు రామన్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఇటీవలనే ఆ పార్టీలో చేరిన తన రాజకీయ ప్రత్యర్థులను కలుపుకొని ఎలా వెళ్తారు అన్నది కూడా చర్చకు దారి తీస్తున్నారు. ఆ జిల్లాలో బిజెపి శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ సైతం ఎన్నికల పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది చర్చగా మారింది.

Next Story