కత్తులతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ముగ్గురి అరెస్ట్..

by Bhanu |

కత్తులతో సోషల్ మీడియాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసెలా పోస్టులు పెట్టిన ముగ్గురుపై ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి బుధవారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి తెలియ చేశారు.

కత్తులతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ముగ్గురి అరెస్ట్..
X

దిశ, ఆదిలాబాద్ : కత్తులతో సోషల్ మీడియాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసెలా పోస్టులు పెట్టిన ముగ్గురుపై ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి బుధవారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి తెలియ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ టు టౌన్ పరిధిలోని తాటి గూడ కు చెందిన రాహుల్ జందాడే, క్రాంతి నగర్ కు చెందిన సయ్యద్ రిజ్వాన్, మహాలక్ష్మి వాడ చెందిన తైవార్ ఖాన్ లు సోషల్ మీడియాలో కత్తులను పట్టుకొని ప్రజలను భయభ్రాంతులను గురి చేసేలా వీడియోలను బుధవారం పోస్ట్ చేశారని తెలిపారు.

దీంతో వీరిపై క్రైమ్ నెంబర్ 216/25 తో అండర్ సెక్షన్ 25(1)(a) ఆర్మ్స్ యాక్ట్ లో 351 (3) బిఎన్ఎస్, 67 ఐటి యాక్ట్ తో కేసును నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సబ్ డివిజనల్ పరిధిలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, యువత కత్తులతో ప్రజలను భయభ్రాంతులను గురి చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన,రోడ్లపై పుట్టినరోజు కార్యక్రమాలను నిర్వహించిన, అనధికారికంగా ఎలాంటి కార్యక్రమాలను కత్తులతో నిర్వహించినా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. అదేవిధంగా రోడ్లపై, పబ్లిక్ స్థలాలలో మద్యం సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Next Story