- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బావిలో పడి యువకుడు మృతి.. గర్భిణీ భార్యకు తీరని విషాదం
మండలంలోని చింతగూడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

దిశ, జన్నారం: మండలంలోని చింతగూడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గజ్జెల భూపతి (30) ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందినట్లు జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, భూపతి తన పాలేరు చక్రం లచ్చుతో కలిసి ఆదివారం ఉదయం చింతగూడ గ్రామ శివారులో ఆకుల నాగన్నకు చెందిన కౌలు భూమిలో మొక్కజొన్న పంట వ్యర్థాలను తొలగించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో బహిర్భూమికి వెళ్లిన భూపతి, బావి వద్ద ప్రమాదవశాత్తూ జారి బావిలో పడిపోయాడు. దీంతో నీట మునిగి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి గజ్జెల మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు. కాగా, భూపతికి గత ఏడాది అదే గ్రామానికి చెందిన శ్వేతతో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె తొమ్మిది నెలల గర్భిణీ కావడంతో ఈ ఘటన కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. యువకుడి ఆకస్మిక మరణంతో చింతగూడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.






