నా కొడుకు మ‌ర‌ణానికి మీరే బాధ్యులు.. త‌ల్లి ఆవేద‌న‌..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-07 15:00:01  IST  )

దిశ‌, ఖానాపూర్ : త‌న కుమారుడి మ‌ర‌ణానికి మీరే బాధ్యుల‌ని.. నా కొడుకు కి టీసీ ఇచ్చి చంపేశారు. మాకు

నా కొడుకు మ‌ర‌ణానికి మీరే బాధ్యులు.. త‌ల్లి ఆవేద‌న‌..!
X

దిశ‌, ఖానాపూర్ : త‌న కుమారుడి మ‌ర‌ణానికి మీరే బాధ్యుల‌ని.. నా కొడుకు కి టీసీ ఇచ్చి చంపేశారు. మాకు న్యాయం చేయాల‌ని విద్యార్థిని త‌ల్లి త‌మ బంధువుల‌తో క‌లిసి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోని ప్ర‌ధానోపాధ్యాయుడిని అడ‌గ‌టానికి వెళ్లితే.. విద్యావాలంట‌రీ భ‌ర్త వీడీసీ స‌భ్యునడిన‌ని దౌర్జన్యానికి దిగాడు అని విద్యార్థి త‌ల్లి, బంధువులు ఆరోపించారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. నిర్మ‌ల్ జిల్లా ఖానాపూర్ మండ‌లంలోని బీర్నంది గ్రామానికి చెందిన చెల్లా గంగామ‌ణి కుమారుడు చెల్లా డేవిడ్ రాజు(14) మ‌స్కాపూర్ ప్ర‌భుత్వ బీసీ హాస్ట‌ల్ లో ఉంటూ మ‌స్కాపూర్ ప్ర‌భుత్వ జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో తొమ్మిదోత‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. బీసీ హాస్ట‌ల్ లో తోటి విద్యార్థుల‌తో లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని నా కొడుకు పై ఆరోప‌ణ‌లు చేస్తూ ప్ర‌ధానోపాధ్యాయుడు న‌రేంద‌ర్, హాస్ట‌ల్ వార్డెన్ ప్ర‌కాశ్ ఆరా తీశామ‌ని.. నా కొడుకు అక్టోబ‌ర్ 23న టీసీ ఇచ్చి పంపారని తెలిపింది.

దీంతో మ‌న‌స్థాపానికి గురై ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడని మ‌ర‌ణించిన విద్యార్థి త‌ల్లి వెల్ల‌డించింది. శుక్ర‌వారం ప్ర‌భుత్వ జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌కు వెళ్లి ప్ర‌ధానోపాధ్యాయుడితో నా కొడుక్కు కి టీసీ ఇచ్చి మీరే చంపేశారు అని.. మాకు న్యాయం చేయాల‌ని విద్యార్థి త‌ల్లి, అత‌ని బంధువులు అడిగేందుకు వెళ్ల‌గా విద్యా వాలంట‌రీ భ‌ర్త పుప్పాల గ‌జేంద‌ర్ ఆడ‌వాళ్ల‌ను అని కూడా చూడ‌కుండా దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డాడ‌ని వారు ఆరోపించారు. దీంతో విద్యార్థి బంధువులు పాఠ‌శాల ముందు కొద్ది సేపు ఆందోళ‌న చేప‌ట్టారు. ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని ఇరువురుకి స‌ర్ది చెప్పి ఆందోళ‌న‌ను విర‌మింప‌జేశారు.

వార్డెన్ ఫిర్యాదుతో టీసీ ఇచ్చాం : ఇన్ చార్జీ ప్రధానోపాధ్యాయుడు శంక‌ర్

ఆ విద్యార్థి తోటి విద్యార్థిని పై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని.. ఆ విద్యార్థికి టీసీ ఇవ్వాల‌ని బీసీ హాస్ట‌ల్ వార్డెన్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు వారి త‌ల్లిని పిలిచి టీసీ ఇచ్చి పంపించామ‌ని శుక్ర‌వారం విద్యార్థి త‌ల్లి, అత‌ని బంధువులు పాఠ‌శాల‌లోకి చోర‌బ‌డి దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డారని పాఠ‌శాల ఇన్ చార్జీ ప్రధానోపాధ్యాయుడు శంక‌ర్ తెలిపారు.

Next Story