- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్ష్మణచందాలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు
మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా ప్రెస్ తరఫున డాక్టర్లు, సిబ్బందిని సన్మానించారు.

దిశ, లక్ష్మణచందా : మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా ప్రెస్ తరఫున డాక్టర్లు, సిబ్బందిని సన్మానించారు. డాక్టర్ ప్రత్యూష, మౌనిక మాట్లాడుతూ ఆరోగ్యమంటే కేవలం వ్యాధి లేకపోవడమే కాదు, అది సంపూర్ణ శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సును సూచిస్తుందని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశాభివృద్ధి సాధ్యమని, అందుకే ప్రపంచ దేశాలు ఆరోగ్యానికి అంత ప్రాధాన్యం ఇస్తున్నాయని అన్నారు. ప్రజలందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉంచాలని లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ప్రపంచ స్థాయి ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం గురించి ప్రజలు, సంస్థలు, ప్రభుత్వాలకు తెలియజేయడం, ప్రజలను మంచి ఆహార అలవాట్లు, పరిశుభ్రత పాటించేలా చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మరియు ప్రజా ప్రెస్ అధ్యక్షుడు ముక్కెర మహేందర్, ఉపాధ్యక్షుడు బిర్కుల రమేష్, అలుగుల శ్రీనివాస్, చెవ్వ రాజేందర్, తేలు రాజేశ్వర్, బ్రహ్మదండి సంతోష్ సభ్యులు పాల్గొన్నారు.






