- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచినీటి కోసం మహిళల ధర్నా
by Elthuri vijay kumar |
కాగజ్ నగర్ మండలంలోని వంజీరి గ్రామంలో శనివారం మహిళలు ఖాళీ బిందేలతో రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ ద్వారా గ్రామానికి నీటి సరఫరా లేకపోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

X
మంచినీటి కోసం మహిళల ధర్నా
ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన
వంజీరి గ్రామంలో ఆందోళన
దిశ, ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ మండలంలోని వంజీరి గ్రామంలో శనివారం మహిళలు ఖాళీ బిందేలతో రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ ద్వారా గ్రామానికి నీటి సరఫరా లేకపోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో బోరుబావులు లేక పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని మహిళలు తెలిపారు. తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నా అది సరిపోవడం లేదని, శాశ్వత పరిష్కారంగా గ్రామంలో బోరుబావి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా కాగజ్ నగర్ ఫారెస్ట్ చెక్‌పోస్ట్ సమీపంలోని ప్రధాన రహదారిపై సాగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Next Story






